SPS నెల్లూరు జిల్లా
నవాబ్ పేట పోలీసు స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా యస్.పి. శ్రీ డా.కె. తిరుమలేశ్వర రెడ్డి,IPS., గారు.
నవాబ్ పేట పోలీసు స్టేషన్ పరిసరాలను పరిశీలించి శిధిలావస్థలో ఉన్న వాహనాలను కోర్టు అనుమతితో వేలం వేయాలని ఆదేశాలు. పోలీసు స్టేషన్ మ్యాప్, చార్ట్ ను పరిశీలించి స్టేషన్ పరిధిలో ఉన్న నేర మరియు శాంతి భద్రతల పరిస్థితులను ఆరా తీసిన యస్.పి. గారు.అనంతరం గ్రేవ్ కేసుల CD ఫైల్స్ క్షుణ్ణంగా పరిశీలించి తగిన ఆదేశాలు జారీ చేసిన యస్.పి. గారు. మహిళా సంబంధిత కుటుంబ తగాదాలు, మిస్సింగ్ కేసులలో సత్వరమే స్పందించాలని ఆదేశాలు. దొంగతనం కేసులలో కోల్పోయిన ప్రాపర్టీ రికవరీపై దృష్టి సారించాలి. రౌడీ షీటర్స్, పాత నేరస్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని ఇవ్వాలని ఆదేశాలు. హత్య, POCSO, SC/ST, వరకట్న వేధింపుల కేసుల దర్యాప్తుపై పలు సూచనలు చేసిన యస్.పి. గారు. పోలీసు స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా నడుచుకోవాలని ఆదేశాలు.. దర్యాప్తు పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశాలు. నిందితులకు కోర్టులో కఠిన శిక్షలు పడాలి. పోలీసు స్టేషన్ సిబ్బంది యొక్క యోగ క్షేమాలు అడిగి, ఏమైనా సమస్యలు ఉన్నాయా? వారి యొక్క గ్రీవెన్స్ ను అడిగి, ప్రతి శుక్రవారం జరిగే మెన్ గ్రీవెన్స్ ను సద్వినియోగం చేసుకోవాలని, అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు.
జిల్లా పోలీసు కార్యాలయం, తేది.16.05.2023.
Post a Comment