SPS నెల్లూరు జిల్లా
జిల్లా పోలీసు కార్యాలయం, తేది.15.05.2023.
'స్పందన' కార్యక్రమంను నిర్వహించిన జిల్లా యస్.పి. డా.కె. తిరుమలేశ్వర రెడ్ది,IPS., గారు
జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక “స్పందన” కార్యక్రమం నిర్వహించిన జిల్లా యస్.పి. గారు. 87 ఫిర్యాదులు స్వీకరణ, సుదూర ప్రాంతాల ఫిర్యాదుదారులు అందరికీ భోజనాలు, మజ్జిగ అందించిన జిల్లా యస్.పి. గారు. నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకొని మోసపూరిత ప్రకటనలు, నకిలీ నియామక పత్రాలతో వివిధ సంస్థలలో ఉద్యోగాలు ఎరగా చూపి నమ్మించి మోసం చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచన. మున్సిపల్, రెవెన్యూ, R&B మరియు దేవాదాయ శాఖలతో ముడిపడి శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడే సున్నిత అంశాలలో న్యాయపరమైన సలహాలు పొంది తగు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు. మనస్పర్ధలు, అపార్దాల కారణంగా చిన్నాభిన్నం అవుతున్న కుటుంబాలకు కౌన్సెలింగ్ ద్వారా చక్కదిద్ది భద్రత, భరోసా కల్పించండి. నమోదు కాబడిన కేసులలోని అలసత్వం లేకుండా ముద్దాయిలపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు. ఆస్థి కోసం కన్న తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేసే అంశాలలో చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశాలు. గొలుసు, బైకు దొంగతనాల కేసులలో చోరీ సొత్తు రికవరీకి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశాలు. స్పందన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి, సంబందిత అధికారులతో మాట్లాడి, త్వరితగతిన పరిష్కరించి భాధితులకు న్యాయం చేసేలా ఆదేశాలు జారీ.. స్పందనలో ఉద్యోగాల పేరుతొ మోసం, ప్రేమ పేరుతో మోసం, కుటుంబ కలహాలు, భర్త/అత్తారింటి వేధింపులు, ఆన్ లైన్ సైబర్ మోసాలు, భూ, ఆస్థి వివాదాలు, తల్లిదండ్రులను పిల్లల వేధింపులు, నమోదైన కేసులలో పురోగతి, ఇతర వివాదాలు మరియు సమస్యల ఫిర్యాదులు స్వీకరణ.
ఈ కార్యక్రమంలో జిల్లా యస్.పి. గారితో పాటు అడిషనల్ యస్.పి.(అడ్మిన్), DTC DSP, నెల్లూరు రూరల్ DSP, AR DSP గార్లు పాల్గొన్నారు.
Post a Comment