హాటుగా మొదలై కూల్ గా ముగిసిన మునిసిపల్ కౌన్సిల్ సమావేశం







 హాటుగా మొదలై కూల్ గా ముగిసిన

మునిసిపల్ కౌన్సిల్ సమావేశం.

సమస్యలు చెప్పడమే పరిష్కారం సూన్యం.

కాళ్ళు పట్టుకుని ఎన్నికల్లో గెలిచాం

కాలువ కూడా వేయలేక పోతున్నాం.

వివరంగా లేని అజండా పై అధికార పార్టీ కౌన్సిల్ కన్నెర్ర.

రవి కిరణాలు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట:-

సూళ్లూరుపేట మునిసిపల్ అత్యవసర  కౌన్సిల్ సమావేశం బుధవారం స్థానిక స్త్రీశక్తి భవన్ లో జరిగింది, సమావేశం ముందు హాట్ హాటుగా మొదలైంది అవతల కూల్ గా ముగిసింది.

సమస్యలు చెప్పడం తప్ప 

పరిష్కారాలు ఉండవు అని

మునిసిపల్ కౌన్సిల్ సమావేశాల్లో కౌన్సిలర్లు అడిగే సమస్యల పైన స్పందించడం లేదని వాటిని పరిష్కరించడం లేదని సమస్యలకు సమాధానం లేనప్పుడు ఈ మీటింగ్లు ఎందుకంటూ కౌన్సిలర్ మిజురు రామకృష్ణ రెడ్డి ధ్వజమెత్తారు. దోమల సంగతి గాలికి వదిలేసారు,వినాయకుని గుడి వద్ద కల్వర్టు నిర్మించలేక పోతున్నారు, కనీస అవసరాలు తీర్చలేని కౌన్సిల్ సమావేశం ఎందుకంటూ వైస్ ప్రెసిడెంట్ చిన్ని సత్యనారాయణ 

ఆవేదన వ్యక్తం చేశారు, మా 7 వ వార్డులో ఆవగింజంత పనికూడా చేయలేదు ఎందుకు 

అధికారులు పట్టించుకోవడం లేదో సమాధానం చెప్పండి అంటూ సన్నారెడ్డి సౌజన్య 

అధికారులను నిలదీశారు,వర్షం వస్తే నడుము లోతు  నీటిలో సచివాలయంకు రావాలి,

కాళ్ళు పట్టుకొని గెలిచాము కాలువలు కూడా వేయలేక పోతున్నాం కొండూరు జనార్దన్ 

ఆక్రోశం వెల్లగక్కారు,  అజండాను ప్రవేశ పెట్టక ముందే ఇలా కౌన్సిలర్లు మునిసిపల్ అధికారుల నిర్లక్షలను ఎత్తి చూపారు,అనంతరం శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి తిరునాళ్ళు 

పురస్కరించుకొని సిద్ధం చేసిన అజండా అంశాలను ప్రవేశ పెట్టారు, కానీ అజండాలోని 

అంశాలు సమగ్రంగా లేవంటూ చిన్ని సత్యనారాయణ సమావేశం నుండి బయటకు వెళ్లే 

ప్రయత్నం చేశారు ఆయనతో పాటు మరి కొంత మంది కౌన్సిలర్లు కూడా బయటకు వెళ్ళడానికి సిద్ధం కావడం తో చైర్మన్ శ్రీమంత్ రెడ్డి వాళ్లకు సర్ది చెప్పి  కూర్చోపెట్టారు. 

అజండా పై కమీషనర్ నరేంద్ర వివరణ ఇవ్వడం తో అజండా లోని తిరునాళ్ళకు సంబంధించి ఖర్చు చేయనున్న  53 లక్షల రూపాయలకు ఆమోదం తెలిపారు,

కౌన్సిలర్లు మాటకు విలువు ఇవ్వాలి

కౌన్సిలర్లు సచివాలయం కు వెళితే సరైన గౌరవం లభించడం లేదని ,చెప్పిన పనులను 

చేసి పెట్టడం లేదని ,కౌన్సిలర్లు పిర్యాదు చేయడం జరిగింది,దీంతో ఈ సమావేశం కు సచివాలయాలు ఇంచార్జిలను పిలిపించి కౌన్సిలర్లకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలని 

ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సచివాలయం సిబ్బంది మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget