ఆక్వా రైతులు, మత్స్యశాఖ అధికారులతో సమావేశం నిర్వహించిన తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి.
తిరుపతి జిల్లా చిట్టమూరు మండలానికి చెందిన ఆక్వా రైతులు తిరుపతి ఎంపీ గురుమూర్తిని తిరుపతిలోని ఎంపీ కార్యాలయంలో కలిసి వారి సమస్యలను విన్నవించారు.
చిట్టమూరు మండలంలో సుమారు 1300 ఆక్వా కరెంట్ కనెక్షన్లు ఉన్నాయని దానిలో 136 కనెక్షన్లకి మాత్రమే సబ్సిడీ వర్తిస్తుందని మిగిలిన వాటికీ సబ్సిడీ వర్తించడం లేదని ఎంపీ దగ్గర వారి ఆవేదనను వెలిబుచ్చారు.
పలుమార్లు మత్స్య శాఖ అధికారులను కలిసిన కూడా తమ సమస్య పరిష్కారం కాలేదని తెలియజేసారు. సమస్య పరిష్కారం కోసం వెంటనే ఎంపీ గురుమూర్తి మత్స్యశాఖ కమిషనర్ తో మాట్లాడగా అక్కడ ఆక్వా సాగు చేస్తున్న ప్రాంతం ఆక్వా జోన్ లోకి రాదని అందువలన వారికి సబ్సిడీ వర్తించడం లేదని తెలియజేయగా అందుకు ఎంపీ మాట్లాడుతూ మండలంలో ఎక్కువ మంది రైతులు ఆక్వా సాగు చేస్తూన్నారని మరో సారి సర్వే చేసి ఆక్వా జోన్ పరిధిలోకి తీసుకురావాలని చిట్టమూరు మండలమే కాకుండా తిరుపతి జిల్లా పరిధిలో ఆక్వా రైతులకు ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా వారికి న్యాయం చేయాలని కోరగా త్వరలో అధికారుల బృందాన్ని పంపి సమస్య పరిష్కరిస్తామని మత్స్యశాఖ కమిషనర్ హామీ ఇచ్చారు. త్వరలో అధికారుల బృందాన్ని పంపి సమస్య పరిష్కరిస్తామని మత్స్యశాఖ కమిషనర్ హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో ఆక్వా రైతులు, మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ నాయక్ , అసిస్టెంట్ డైరెక్టర్ చాంద్ భాషా మరియు మత్స్యశాఖకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
Post a Comment