"విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుంది" - మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.
SPS నెల్లూరు జిల్లా:
తేది:15-05-2023:- సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలంలో విభిన్న ప్రతిభావంతులకు పరికరాలు అందించేందుకు వైద్య శిబిరాన్ని తిరుపతి పార్లమెంట్ సభ్యులు మద్దిల గురుమూర్తి గారితో కలిసి ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మాత్యులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.
గత ప్రభుత్వ హయాంలో వికలాంగులకు వైకల్యం శాతం ఆధారంగా అతి తక్కువ పింఛన్లు ఇచ్చేవారు.ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు దివ్యాంగులకు వైకల్య శాతంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి 3000 రూపాయలు పింఛను అందజేస్తున్నారు. నియోజకవర్గంలోని దివ్యాంగులకు అందరికీ అవసరమైన ట్రై సైకిళ్లు, మోటారు వాహనాలు, వినికిడి యంత్రాలు మొదలైన పరికరాలను ఎంపీ గురుమూర్తి ప్రత్యేక చొరవతో కేంద్ర ప్రభుత్వం, అలింకో సంస్థ సహకారంతో అందిస్తుంది. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ, ఎంపీ నిధులతో ఈ పరికరాలను అవసరమైన ప్రతి ఒక్కరికి అందజేస్తాం. వైద్య శిబిరాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకుని అవసరమైన పరికరాలను పొందాలి. సర్వేపల్లి నియోజకవర్గంలో దివ్యాంగుల కోసం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడానికి ప్రత్యేక చొరవ తీసుకున్న తిరుపతి పార్లమెంట్ సభ్యులు మద్దిల గురుమూర్తి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
Post a Comment