ఫ్రైడే- డ్రై డే తో దోమల ఉత్పత్తికి కట్టడి
రవికిరణాలు ప్రతినిధి - దొరవారిసత్రం :- దోమల ఉత్పత్తి లార్వాలను అరికట్టడం, పలు రకాల జ్వరాలను ప్రజల నుండి దూరం చేయడం వంటి కార్యక్రమానికై రాష్ట్ర ప్రభుత్వం ఫ్రైడే- డ్రై డే అనే కార్యక్రమాన్ని ప్రతి శుక్రవారం ఆరోగ్య ఆరోగ్యశాఖ అమలు చేస్తోంది. ఈ క్రమంలోని మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో పనిచేస్తున్న ఆరోగ్య సిబ్బంది శుక్రవారంఈ కార్యక్రమాన్ని అమలు చేశారు.ప్రతి గ్రామంలో 50 గృహాలకు పైబడి సర్వే చేపట్టి వారి పరిసరాల్లో ఉన్న వస్తు సామాగ్రిలో, నీటి నిల్వలు పాత్రలు, తొట్టెలు, సంపులను పరిశీలించి దోమల లార్వాలను పూర్తిస్థాయి నిర్మూలనకు చర్యలు చేపట్టారు. ప్రజలకు ఈ కార్యక్రమం ప్రాధాన్యతను గురించి అవగాహన కల్పించారు. మన గృహం, పరిసరాలు పరిశుభ్రత పాటించాలని, ప్రతి శుక్రవారం నీటి నిల్వలు చేసే పాత్రలను ఎండగట్టాలని తెలియజేశారు. ఈ కార్యక్రమాల పర్యవేక్షణ సంబంధిత సూపర్వైజర్లు పరిశీలిస్తున్నారు. నీటి నిల్వలు ఉన్న పాత్రల్లో తోక పురుగులు లాంటివి కనిపిస్తే వెంటనే ఆ నీటిని భూమిపై పారవేయాలని సూచించారు. ఈ రోజు జరిగిన సర్వే కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు హాజరయ్యారు.
Post a Comment