వై ఎస్ ఆర్ సంపూర్ణ పోషణ పంపిణీ సక్రమంగా జరిగేలా మహిళా శిశు సంక్షేమ శాఖ చర్యలు చేపట్టాలి





 వై ఎస్ ఆర్ సంపూర్ణ పోషణ పంపిణీ సక్రమంగా జరిగేలా మహిళా శిశు సంక్షేమ శాఖ చర్యలు చేపట్టాలి

సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన విధులలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు: కలెక్టర్

రవి కిరణాలు,

తిరుపతి, మే15: -

 వైయస్సార్ సంపూర్ణ పోషణ పంపిణీ, గర్భిణీ స్త్రీల గృహ సందర్శన సక్రమంగా అమలు అయ్యేలా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు ఎంతో బాధ్యతగా పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా ఉండాలని, లేనిచో చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని సంబంధిత అధికారులను హెచ్చరించారు.

సోమవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహిళా శిశు సంక్షేమ శాఖ సిడిపిఓలు, సూపర్వైజర్లతో కలెక్టర్  సమీక్షిస్తూ విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని తప్పనిసరిగా క్రమశిక్షణ చర్యలు ఉంటాయని ప్రజాసేవ కొరకే మనం ఉన్నామని గుర్తుంచుకొని అంకితభావంతో పనిచేయాలని అన్నారు. 

అంగన్వాడీ ద్వారా ఆరు సంవత్సరాల లోపు పిల్లలకు అందజేస్తున్న, గర్భిణీల స్త్రీ లకు అందజేస్తున్న,  ఎత్తు తక్కువ బరువు తక్కువ కల పిల్లలు, బుద్ధి మాంద్యం గల పిల్లలకు అందచేస్తున్న వై ఎస్ ఆర్ సంపూర్ణ పోషణ పంపిణీ సక్రమంగా జరిగేలా చర్యలు చేపట్టాలని అన్నారు.  అంగన్వాడీ కార్యకర్తలపై పర్యవేక్షణ, తరచూ సమీక్షలు చేయాలని, సంబంధిత సిడిపిఓ లు, సూపర్వైజర్లు గృహ సందర్శనలు నిర్వహించాలని అన్నారు. ఏఎన్ఎం లు, అంగన్వాడీ కార్యకర్తలు సేకరిస్తున్న సమాచారం ఒకేలా ఉండేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఆర్ సి హెచ్ ఐడీ లు సరిపోయేలా ఉండాలని సూచించారు. పిల్లల ఆధార్ సీడింగ్ వేగవంతం చేయాలని ఆదేశించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల పారామీటర్లలో తక్కువ అంటే 95  శాతం పైననే పురోగతి ఉండాలని తెలిపారు. సిడిపివోలు సూపర్వైజర్లు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు మెరుగైన సేవలు ప్రజలకు అందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని గుర్తు చేశారు. పనితీరు మెరుగుపడకపోతే సంబంధిత అధికారులపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

ఈ సమావేశంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని జయలక్ష్మి, సిడిపివోలు సూపర్వైజర్లు తదితరులు హాజరయ్యారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget