జీవ వైవిద్యంలో మేనకూరు పంచాయతీకి ఉత్తమ అవార్డు
రవి కిరణాలు తిరుపతి జిల్లా నాయుడుపేట:-
మానవాళి మనుగడకు అవసరమైన జీవవైవిద్యాన్ని పెంపొందించడంలో విశేష కృషి చేసిన నాయుడుపేట మండలం మేనకూరు పంచాయతీ ఉత్తమ అవార్డును కైవసం చేసుకుంది.
సోమవారం తిరుపతిలోని ఎస్వీ వెటర్నరీ ఆడిటోరియంలో జరిగిన అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం సందర్భంగా ఉత్తమ అవార్డును ఆంధ్రప్రదేశ్ జీవ వివైద్యం బోర్డు చైర్మన్ బి ఎం కె రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కట్టా సుధాకర్ రెడ్డి కి అందజేశారు. ఈ సందర్భంగా మేనకూరు పంచాయతీలో జీవ వైవిద్యాన్ని పెంపొందించడంలో కృషిచేసిన వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కట్టా సుధాకర్ రెడ్డిని రాష్ట్ర జీవవైవిద్య బోర్డు చైర్మన్ బి ఎం కె రెడ్డి అభినందించారు.అలాగే జీవవైవిద్యాన్ని పెంపొందించేందుకు క్రియాశీలకంగా పనిచేసిన సంగీతాల చంద్రశేఖర్ ను ఆయన అభినందించారు. వారి వెంట నాయుడుపేట మాజీ వైస్ ఎంపీపీ నన్ను కస్తూరయ్య తదితరులు ఉన్నారు.
Post a Comment