పిల్లల చదువుపై పెట్టే డబ్బు ఖర్చు కాదు... అది వారి భవిష్యత్తుకు పెట్టుబడి.








 

పిల్లల చదువుపై పెట్టే డబ్బు ఖర్చు కాదు... అది వారి భవిష్యత్తుకు పెట్టుబడి.

పేదరికం కారణంగా ఏ ఒక్క విద్యార్థి చదువుకు దూరం కాకూడదు.

 జిల్లాలో జగనన్న  విద్యా దీవెన కింద 30,259 మంది  విద్యార్థులకు చెందిన మొత్తాన్ని 27293 మంది తల్లుల ఖాతాల్లో  రూ.27.15 కోట్లు జమ: జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి.

 రవి కిరణాలు,తిరుపతి, మే 24 : -

పేదరికం కారణంగా ఏ ఒక్క విద్యార్థి చదువుకు దూరం కాకూడదు అనే ఉద్దేశంతో గౌ. ముఖ్యమంత్రి వై యస్ జగన్మోహన్ రెడ్డి విద్యా దీవెన  కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగిందని తూర్పు గోదావరి జిల్లాలోని కొవ్వూరు నుండి   గౌ. ముఖ్యమంత్రి  వై.యస్. జగన్మోహన్ రెడ్డి జగనన్న  విద్యా దీవెన  పథకం కింద రాష్ట్రంలోని 2022-23 విద్యా సంవత్సరానికి చెందిన జనవరి23- మార్చి23 రెండవ త్రైమాసికానికి చెందిన ఫీజ్ రీయింబర్స్మెంట్ ఆర్థిక సహాయాన్ని 09.95 లక్షల మంది విద్యార్థులకు రూ. 703  కోట్లను కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా అర్హులైన విద్యార్థుల తల్లుల  ఖాతాల్లోకి జమ చేయగా స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించే ఏర్పాట్లు చేయగా జిల్లా కలెక్టర్ కె.వెంకట రమణారెడ్డి వివిధ కళాశాలల విద్యార్థినీ  విద్యార్ధులు పాల్గొని గౌ. సి.ఎం సందేశాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు.

ముఖ్యమంత్రి సందేశం అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 2022-23 విద్యా సంవత్సరానికి చెందిన రెండవ విడత జగనన్న  విద్యా దీవెన ఆర్థిక సాయాన్ని జిల్లాలో 30,259 మంది విద్యార్థుల తల్లుల ఖాతాలకు  సుమారు రూ. 27.15 కోట్లు నేడు గౌ.ముఖ్యమంత్రి తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు బహిరంగ సభ నుండి కంప్యూటర్ బటన్ నొక్కి జమ చేయడం జరిగిందని తెలిపారు.

విద్యార్థులను జగనన్న  విద్యా దీవెనలో నమోదు చేసే పూర్తి బాధ్యత కళాశాలల యాజమాన్యందని వారు ఏ ఒక్క అర్హత కలిగిన విద్యార్థిని నమోదు చేయని పక్షంలో వారికి సంబంధించిన ఫీజు మొత్తాన్ని కళాశాల యాజమాన్యం భరించాల్సి ఉంటుందని గుర్తు చేశారు. జగనన్న  విద్యా దీవెన మొత్తం తల్లుల ఖాతాల్లో జమ అయిన పది రోజుల్లోపు సంబంధిత కళాశాలలకు వారు చెల్లించి తల్లుల సహకరించాలనీ, లేనిచో తదుపరి వారి జగనన్న  విద్యా దీవెన మొత్తాన్ని నేరుగా కళాశాలలకు చెల్లింపు చేస్తారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి  గారు చెప్పిన విధంగా విద్యార్థుల చదువు కోసం పెట్టే డబ్బు ఖర్చు కాదని వారి భవిష్యత్తుకు పెట్టుబడి అని గమనించి అందరు తల్లితండ్రులు తమ పిల్లలను చదివించాలని అన్నారు. ప్రతి విద్యార్థి ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని సద్వినియోగం చేసుకుని బాగా చదువుకొని సమాజానికి ఉపయోగపడే ఉత్తమ పౌరులుగా తయారై రాష్ట్రానికి దేశానికి సేవ చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యా దీవెన కింద రూ. 27.15 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ మెగా చెక్ ను విద్యార్థులకు అందచేశారు.

జగనన్న విద్యా దీవెన పథకం క్రింద నియోజకవర్గo వారీగా సుమారుగా లబ్దిపొందిన మొత్తం, విద్యార్థుల వివరాలు:

 చంద్రగిరి నియోజక వర్గానికి సంబంధించి  5829 మంది విద్యార్థుల తల్లుల ఖాతాలకు రూ.5.23 కోట్లు, తిరుపతి నియోజక వర్గానికి సంబంధించి   4930 మంది విద్యార్థుల తల్లుల ఖాతాలకు రూ.4.79 కోట్లు, గూడూరు నియోజక వర్గానికి సంబంధించి  3616  మంది విద్యార్థుల తల్లుల ఖాతాలకు రూ.3.59 కోట్లు , నగరి నియోజక వర్గానికి సంబంధించి  1736 మంది విద్యార్థుల తల్లుల ఖాతాలకు రూ.1.38 కోట్లు, సత్యవేడు నియోజక వర్గానికి సంబంధించి 3405 మంది విద్యార్థుల తల్లుల ఖాతాలకు రూ. 2.58 కోట్లు,  శ్రీకాళహస్తి నియోజక వర్గానికి సంబంధించి 4793 మంది విద్యార్థుల తల్లుల ఖాతాలకు రూ.4.19 కోట్లు, సూళ్ళూరుపేట నియోజకవర్గానికి సంబంధించి 3510 మంది విద్యార్థుల తల్లుల ఖాతాలకు రూ.3.26 కోట్లు, వెంకటగిరి నియోజక వర్గానికి సంబంధించి 2440 మంది విద్యార్థులు తల్లుల ఖాతాలకు రూ.2.13 కోట్లు వెరసి రూ.27.15 కోట్లు 27293 మంది తల్లుల ఖాతాలలో 30259 మంది విద్యార్థులకు  జమ చేయడం జరిగిందని తెలిపారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికార అధికారి చెన్నయ్య, బి.సి సంక్షేమ మరియు సాధికార అధికారి భాస్కర్ రెడ్డి, సంక్షేమ శాఖల అధికారులు, వివిధ కళాశాలల విద్యార్థులు, తల్లులు, తదితర అధికారులు పాల్గొన్నారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget