ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు రేపట్నుంచి వేసవి సెలవులు ప్రారంభంకానున్నాయి. ఈనెల 15 నుంచి జూన్ 12 వరకు వేసవి సెలవులు ఉండనున్నట్లు ప్రకటించారు. అలాగే మూడు పని శనివారాలు, అంటే మే 20, మే 27, జూన్ 3 రిజిస్ట్రీకి సెలవులుగా ప్రకటించారు. హైకోర్టు కార్యకలాపాలు తిరిగి జూన్ 13న ప్రారంభమవుతాయి. ఈ సెలవుల్లో అత్యవసర కేసుల విచారణ నిమిత్తం వెకేషన్ కోర్టులు ఏర్పాటయ్యాయి. రెండు దశల్లో ఈ వెకేషన్ కోర్టులు పనిచేస్తాయి. మొదటి దశ వెకేషన్ కోర్టులు మే 16 నుంచి 26 వరకు, రెండో దశ కోర్టులు మే 27 నుంచి జూన్ 12 వరకు పనిచేస్తాయి. వీటిల్లో భౌతిక, ఆన్‌లైన్ విధానంలో కేసులను విచారిస్తారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా ఆదేశాల మేరకు వీటిని ఏర్పాటుచేశారు.
Post a Comment