బందరు పోర్టు నిర్మాణంతో 25 వేల ఉద్యోగ అవకాశాలు.మంత్రి పెద్దిరెడ్డి
రవి కిరణాలు, తిరుపతి:-
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ సోమవారం శంకుస్థాపన చేసిన బందరు పోర్టు ఏర్పాటుతో 25 వేల ఉద్యోగ అవకాశాలు లభ్యమవుతాయని రాష్ట్ర విద్యుత్ అటవీ భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. సోమవారం తిరుపతి ఎస్వీ వెటర్నరీ ఆడిటోరియంలో జరిగిన అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడారు. 35.12 మిలియన్ టన్నుల సామర్థ్యంగల రెండు జనరల్ కార్గోలతో బందరు పోటు నిర్మాణం చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఒకటి బొగ్గు,2 మల్టీ పర్పస్ కంటైనర్లకు నాలుగు బెర్తు లతో బందరు పోర్టు ను నిర్మించనున్నట్లు తెలిపారు. రెండున్నరఏళ్లలో పోర్టు నిర్మాణం పూర్తి అవుతుందన్నారు. పోర్టు నిర్మాణం పూర్తయితే ప్రత్యక్షంగా 25 వేల మంది ఉద్యోగాలు తోపాటు పరోక్షంగా మరో 50 వేల మందికి ఉపాధి అవకాశం కలుగుతుందని తెలిపారు. ఉద్యోగాలు,ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తూ, అభివృద్ధికి బాటలు వేస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల్లో విజయం సాధిస్తుందని, మరో మారు జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని ఆయన తెలియజేశారు. ఆయన వెంట చిత్తూరు ఎంపీ రెడ్డప్ప,వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కట్ట సుధాకర్ రెడ్డి, టిటిడి పాలకమండలి సభ్యులు అశోక్, నాయుడుపేట మాజీ వైస్ ఎంపీపీ నల్లు కస్తూరయ్య తదితరులు ఉన్నారు.
Post a Comment