ఇస్రో లో యువికా 2023 శిక్షణ ప్రారంభం.




 ఇస్రో లో యువికా 2023 శిక్షణ ప్రారంభం.

 దేశ వ్యాప్తంగా 7 ఇస్రో సెంటర్లలో 

353 మంది విద్యార్థులకు శిక్షణ.

రవి కిరణాలు, తిరుపతి జిల్లా (సూళ్లూరుపేట) శ్రీహరి కోట,మే 15:-  

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రతియేటా నిర్వహించే యువికా కార్యక్రమం లో భాగంగా 

యువికా -2023 శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించింది,భారత దేశం లోని మొత్తం 7 ఇస్రో కేంద్రాలలో 353 మంది విద్యార్థులకు అంతరిక్ష పరిజ్ఞానం పై అవగాహన కల్పిస్తూ శిక్షణ ఇవ్వనున్నారు, ఈ కార్యక్రమాన్ని ఇస్రో ప్రధాన కేంద్రం నుండి ముందుగా చైర్మన్ 

సోమనాధ్  ప్రారంభించడం జరిగింది,షార్ సెంటర్లో షార్ డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్ 

ప్రారంభించారు,శ్రీహరికోటలో ఆంధ్రప్రదేశ్,ఒడిశా ,ఛతీస్ గడ్ ,  పశ్చిమబెంగాల్ ,మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 56 మంది విద్యార్థులు రెండు వారల పాటు ఈ నెల 27 వరకు శిక్షణ పొందనున్నారు, 8 వ తరగతి పూర్తి చేసి వివిధ అంశాలలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులను ఈ శిక్షణకు ఇస్రో ఎంపిక చేసి ఈ శిక్షణను ఇవ్వడం జరుగుతుంది.విద్యార్థి దశ నుండి అంతరిక్ష పరిశోధనలు పట్ల విద్యార్థులను ఆకర్షితులను చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం అని అన్నారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget