తిరుపతి జిల్లా , గూడూరు పట్టణంలోగల నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో Roi చెస్ అకాడమీ మరియు పిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ ఆద్వర్యం లో తిరుపతి డిస్ట్రిక్ట్ ఓపెన్ U-17 చెస్ ఛాంపియన్‌షిప్ -2023 ECE సెమినార్ హాల్ లో నిర్వహించారు. ఈ పోటీలలో తిరుపతి జిల్లాలో వివిధ ప్రాంతాలనుండి దాదాపుగా 60 మందీ పిల్లలు వచ్చి ఎంతో ఆసక్తిగా పాల్గొన్నారు. ఈ పోటిల ప్రారంభ వేడుకకు కళాశాల ప్రిన్సిపాల్ డా. రవి ప్రసాద్ గారూ మాట్లాడుతూ ఈ పోటీలలో విజేతలను రాష్ట్ర స్థాయి పోటీలకు పంపించడం జరుగుతుందని కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు.
Roi chess అకాడమీ M.D అబ్దుల్ అజీజ్ గారు మాట్లాడుతూ చదరంగం ఆట అనేది నేర్చుకునే, ఆలోచించే మరియు సరైన పద్ధతిలో నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని మెరుగుపరిచి,ఒక వ్యక్తి యొక్క మానసిక సామర్ధ్యాలను పెంపొందిస్తుంది అని తెలిపారు.తిరుపతి జిల్లా చెస్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ మోహన్ గారు మాట్లాడుతూ ఆట ఆడుతున్నప్పుడే కాకుండా జీవితంలోని అంశాలలో కూడా మెరుగైన వ్యూహాలను రూపొందించడంలో చెస్ సహాయపడుతుందిని తెలిపారు.
Post a Comment