స్టేట్ బ్యాంక్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ను కలిసిన తిరుపతి జిల్లా ఏపీ జేఏసీ చైర్మన్ గోపిరెడ్డి
రవికిరణాలు ప్రతినిధి -దొరవారిసత్రం :- ఉద్యోగుల సంస్థలపై ప్రతి నెలజీతాలువేయాలంటూఏపీ.జే.ఏ.సి, అమరావతి రాష్ట్ర కమిటీ ఇచ్చిన మలి విడత ఉద్యమ కార్యాచరణలో భాగంగా గురువారం డిప్యూటీ జనరల్ మేనేజర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సూళ్లూరుపేట వారిని తిరుపతి జిల్లా ఏపీ జెఎసి చైర్మన్ దొరవారిసత్రం మండల తాసిల్దార్ గోపిరెడ్డి కలిసి ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగులకు 1 వ తారీకున జీతాలు వేయనందున, ఎప్పుడు వేస్తారో తెలియనందున ఈఎంఐల చెల్లింపు ఆలస్యం వల్ల అదనపు ఛార్జీలు బాగా పడుతున్నాయని, సిబిల్ స్కోర్ కూడా మైనస్ అయిపోవడంతో భవిష్యత్ లో ఉద్యోగులకు ఇబ్బందులు తలెత్తుతాయని తీసుకున్న రుణాలకు ఫైన్లు వేయవద్దని, ఈఎంఐ డేట్స్ మార్చవలసినదిగా వినతి పత్రం అంద జేయటం జరిగింది. పై కార్యక్రమంలో లో ఏపీ.జే. ఏ.సి అమరావతి, తిరుపతి జిల్లా చైర్మన్ పి. గోపినాధ్ రెడ్డి మరియునాయకులుపాల్గొన్నారు.బ్యాంక్అధికారులుకూడాసానుకూులంగా స్పందించి అన్ని బ్యాంకలుకు ఈ సమాచారం అందిస్తామని హామీ ఇచ్చారు.
Post a Comment