అందరి సహకారంతో తిరుపతి అభివృద్ధి : నూతన కమిషనర్ హరిత
తిరుపతి
తిరుపతి అభివృద్దికి ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలందరి సహకారంతో నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి అన్ని విధాలా కృషి చేయడం జరుగుతుందని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ నూతన కమిషనర్ గా భాధ్యతలు స్వీకరించిన దామలచెరువు హరిత అన్నారు. నెల్లూరు మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా భాధ్యతలు నిర్వహిస్తూ సాదారణ బదిలిపై తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా హరిత తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో శనివారం భాధ్యతలు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ హరిత మాట్లాడుతూ తిరుపతి నగరం విస్తరించేందుకు అవసరమైన మాస్టర్ ప్లాన్ రోడ్ల అభివృద్దికి కృషి చేయడంతో బాటు స్వచ్చ సర్వేక్షన్లో దేశంలో ఆదర్శవంతమైన నగరంగా తిరుపతిని తీసుకురావడం జరుగుతుందన్నారు. తిరుపతి నగరంలో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తామని, పరిశుభ్రతకు అవసరమైన మౌలిక సదుపాయాలను ప్రజలకు అందివ్వడం జరుగుతుందన్నారు. తిరుపతి అన్ని విభాగాల్లో ఖ్యాతి పొందేలా అందరి సహకారంతో కృషి చేయడం జరుగుతుందన్నారు. తాను తిరుపతి నగరపాలక సంస్థలో గతంలో అదనపు కమిషనర్ గా పని చేయడం వలన నగరంపై పూర్తి అవగాహన వుందని, అదేవిధంగా నెల్లూరు మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా భాధ్యతలు నిర్వహించడం వలన వచ్చిన అనుభవంతో తిరుపతి అభివృద్ధికి కృషి చేస్తానని హరిత తెలిపారు. నూతన కమిషనర్ గా భాధ్యతలు చేపట్టిన కమిషనర్ హరితకు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్లు భూమన అభినయ్ రెడ్డి, ముద్రనారాయణ, కార్పొరేటర్లు, అధికారులు ప్రత్యేక అభినందనలు తెలిపి స్వాగతించడం జరిగింది.
Post a Comment