అర్హతే ప్రామాణికంగా సంక్షేమ ఫలాలు:- కన్వినర్ ఉగ్గమూడి వినయ్ కుమార్
రవి కిరణాలు సూళ్లూరుపేట ఏప్రిల్ 12 :-
అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాల అందిస్తూ, అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ప్రజలు మరోసారి సీఎం గా ఆశీర్వదించాలని కన్వీనర్ ఉగ్గు మూడి వినయ్ కుమార్ అన్నారు. బుధవారం ఎమ్మెల్యే కెలివేటి సంజీవయ్య ఆదేశాల మేరకు సూళ్లూరుపేట మండలంలోని ఉగ్గుమూడి పంచాయతీలో ఆయన స్థానిక వైసిపి నాయకులతో కలిసి జగనన్నే మా భవిష్యత్తు,మా నమ్మకం నీవే జగన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా వారు ప్రతి గడపకు వెళ్లి తమ ప్రభుత్వం చేపట్టి,అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ,వారి ఇళ్లకు స్టిక్కర్లను అంటించి,సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న జగనన్నను ఆశీర్వదించాలని కోరారు.తమ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తుందని అన్నారు.పథకాలందని వారు వివరాలు తెలియజేస్తే వారికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.ఈ కార్యక్రమంలో కన్వీనర్లు, గృహసారధులు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
Post a Comment