నాయుడుపేటలో క్షుద్ర పూజలు కలకలం
భయాందోళనలో స్థానికులు
రవికిరణాలు : నాయుడుపేట ఏప్రిల్ 22 : నాయుడుపేట పట్టణంలోని రాజగోపాలపురం లో నిర్మాణంలో ఉన్న భవనంలో గురువారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేయడం పట్టణంలో కలకలం రేపుతుంది. దీనితో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. నాయుడుపేట మండలంలోని అరవ పెరిమిడి గ్రామానికి చెందిన మదనం బేటి గోపి పట్టణంలోని రాజగోపాలపురం చివరి వీధిలో మూడంతస్తుల భవనం నిర్మిస్తున్నారు. కాగా ఆదివారం పెళ్లకూరు మండలం జీలపాటూరు గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి గోపికి ధాన్యం వ్యాపార విషయమై గొడవ జరిగి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. దీనితో పోలీసులు ఇరువురికి సర్ది చెప్పి రాజీచేసి పంపించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో గురువారం అమావాస్య కావడం గోపి నిర్మిస్తున్న భవనంలో క్షుద్ర పూజలు చేయడం తో గోపి తో గొడవపడ్డవారే క్షుద్ర పూజలు చేయించి ఉంటారని గోపి కుటుంబ సభ్యులు అంటున్నారు. ఈ విషయమై శుక్రవారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు గోపి తెలియజేశారు.
Post a Comment