టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు సందర్భంగా నెల్లూరులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అంబరాన్నంటిన సంబరాలు.
రవికిరణాలు : మీ మునిరాజ
అధినాయకుడి పుట్టినరోజును పండగలా జరుపుకున్న నాయకులు, కార్యకర్తలు అభిమానులు.రక్తదాన శిబిరానికి విశేష స్పందన. మాజీ మంత్రి, పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కామెంట్స్. చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు వేడుకలను నెల్లూరులో ఘనంగా నిర్వహించుకోవడం ఆనందంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు ఆయన పుట్టినరోజు వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. రక్తదానం, అన్నదానం, చలివేంద్రాల ఏర్పాటు వంటి సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మార్కాపురంలో పేదల మధ్య చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. చంద్రబాబు నాయుడు మొదటి నుంచి తన జీవితాన్ని పేదలకు, సమాజసేవకు అంకితం చేశారు.
8 ఏళ్లు ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ప్రభుత్వంలో కీలకపాత్రలో, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా రాష్ట్ర భవిష్యత్ కోసం తపించారు. ఇప్పడు ప్రతిపక్ష నేతగా కూడా సంక్షోభంలో ఉన్న ఏపీతో పాటు బిడ్డల భవిష్యత్తును కాపాడటం కోసం శ్రమిస్తున్నారు . దేశ రాజకీయ చరిత్రలో ఇంత కష్టపడి పనిచేసే నాయకుడు మరొకరు లేనే లేరు. విజన్ 2020 అంటే అప్పట్లో ఏదో అనుకున్నాం..ఆ విజన్ లో భాగంగానే అభివృద్ధి చెందిన హైదరాబాద్ ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందుతోంది. మాకు అటువంటి నాయకుడు దొరకడం, ఆయన నేతృత్వంలో పనిచేస్తుండటం మా అందరి అదృష్టం.
వైసీపీ అరాచక పాలనతో సంక్షోభంలో చిక్కుకుపోయిన రాష్ట్రాన్ని కాపాడకలిగిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడే. ఆయనకు ఫ్యాక్షనిజం చేతకాదు..రౌడీయిజం తెలియదు..దోపిడీ చేయడం, నిద్రలేస్తే అబద్ధాలు మాట్లాడటం చేతకావు..తెలిసిందల్లా రాష్ట్ర అభ్యున్నతికి కష్టపడటమే. ఓ వైపు చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు నిరంతరం ప్రజల మధ్యలో ఉంటే సీఎం జగన్మోహన్ రెడ్డి కుటుంబసభ్యులు జైలు ఊచలు లెక్కబెడుతున్నారు . గొడ్డలి పోటు, కోడికత్తి కేసులతో కోర్టుల చుట్టూ తిరుగుతూ విచారణలను ఎదుర్కొంటున్నారు ..అది మా నాయకులకు వాళ్లకు మధ్య ఉన్న తేడా, అప్పుల ఊబిలో చిక్కుకుపోవడంతో పాటు శాంతిభద్రతలు క్షీణించి నేరమయమైన ఈ రాష్ట్రాన్ని కాపాడటం కోసం ఆ దేవదేవుడి ఆశీస్సులు చంద్రబాబు నాయుడికి ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా , తెలుగుదేశం పార్టీ శ్రేణులతో పాటు రాష్ట్ర ప్రజలందరూ కోరుకున్నట్టుగా ఎఫ్పుడు ఎన్నికలు జరిగినా చంద్రబాబు నాయుడు సీఎం కావడం ఖాయం .
కార్యక్రమంలో పాల్గొన్న జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర, జిల్లా పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, నగర ఇంఛార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే కంభం విజయ రామిరెడ్డి, పట్టాభి రామిరెడ్డి ,నగర అధ్యక్షుడు మామిడాల మధు,రాజా నాయుడు, జన్ని రమణయ్య తదితరులు.
Post a Comment