వేరు వేరు బైకులు ప్రమాదంలో ఇద్దరు మృతి
రవికిరణాలు ప్రతినిధి -దొరవారిసత్రం :- దొరవారిసత్రం మండల పరిధిలోని కలగుంట గ్రామ సమీపంలో ఉన్న జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన వేరు వేరు బైకుల ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు సేకరించిన వివరాలు మేరకు దొరవారిసత్రం మండలం పరిధిలోని వేణుంభాకం గ్రామానికి చెందిన విన్నమాల మోహన్ (25) అను అతను నాయుడుపేటలో వంట మాస్టర్ పనికి వెళ్లి పని ముగిసుకొని తిరిగి తన స్వగ్రామానికి బైక్ పై వస్తూ ఉండగా కలగుంట గ్రామ సమీపాన రోడ్డు పక్కన ఉన్న హైవే ఫోన్ బూత్ ను అదుపుతప్పి ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు ఇదే క్రమంలో నాయుడుపేట మండలం పెరికలపాటి కండ్రిగ గ్రామానికి చెందిన దినేష్(20) అనేయువకుడు సూళ్లూరుపేటకు వెళ్లి తను పనులను ముగించుకొని తిరిగి తన స్వగ్రామానికి వెళుతూ ఉండగా కలగుంట గ్రామ సమీపాన ఉన్న హైవే బ్రిడ్జిని మోటార్ బైక్ పై వస్తు ఉండగా అదుపుతప్పి డివైడర్ను ఢీకొని ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు ఈ విషయాన్ని తెలుసుకున్న ఇన్చార్జి పెళ్ళకూరు ఎస్సై కృష్ణారెడ్డి ఏ ఎస్ ఐ విజయ్ కుమార్ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని సంఘటన జరిగిన తీరును పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఈ విషయాన్ని తన కుటుంబీకులకు తెలియజేశారు ఈ కేసులను ఇన్చార్జి ఎస్ఐ కృష్ణారెడ్డి ఏఎస్ఐ విజయ్ కుమార్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు
Post a Comment