చెంగాళమ్మ సేవలో ఇస్రో చైర్మన్ సోమనాథ్
రాకెట్ విజయ వంతం అవ్వాలని అమ్మ వారికి ప్రత్యేక పూజలు
రవి కిరణాలు, సూళ్లూరుపేట ఏప్రిల్ 21:-
సూళ్లూరుపేట లో వెలసి ఉన్న శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయం లో శుక్రవారం ఇస్రో చైర్మన్ సోమనాధ్ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. శనివారం శ్రీహరికోట అంతరిక్ష పరిశోధనా కేంద్రం (షార్) సెంటర్ నుండి జరిగే పి ఎస్ ఎల్ వి - సి 55 రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని అమ్మణ్ణి కోరుకున్నారు.ముందుగా ఆలయం వద్ద ఆయనకు ఆలయ ఈఓ ఆళ్ళ శ్రీనివాసులు రెడ్డి,ఛైర్మన్ దువ్వూరు బాలచంద్ర రెడ్డి స్వాగతం పలికారు.అనంతరం ఇస్రో చైర్మన్ ఆలయం లోని పరివార దేవతలను దర్శించిన అనంతరం
చెంగాళమ్మను దర్శించి పూజలు చేశారు. ఈ సందర్భముగా ఆలయం ఈఓ ఆళ్ళ శ్రీనివాసులు రెడ్డి ,చైర్మన్ బాలచంద్ర రెడ్డి సంయుక్తముగా ఇస్రో చైర్మన్ కు ఆలయ మర్యాదలు అందజేశారు. అనంతరం ఇస్రో చైర్మన్ సోమనాధ్ మీడియాతో మాట్లాడుతూ పి ఎస్ ఎల్ వి - సి 55 రాకెట్ ప్రయోగం రేపు మధ్యాహ్నం 2 గంటల 20 నిమిషాలకు నిగిలోకి పంపనున్నట్లు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశామని, దీనికి సంబందించిన కౌంట్ డౌన్ ఈ రోజు (శుకరవారం) మధ్యాహ్నం 12 :50 కి ప్రారంభమై 25 గంటల 30 నిమిషాల పాటు నిరంతరంగా కొనసాగుతుందని తెలియజేసారు. ఏడాదికి 12 ప్రయోగాలు చేయడం లక్షంగా ఇస్రో షార్ లో ప్రత్యేక వసతులను సమకూర్చుందని, ఇప్పుడు జరిగే ప్రయోగం పూర్తిగా వాణిజ్జ ప్రయోగమని, పూర్తి స్థాయి వాణిజ్జ ప్రయోగాలలో ఇది ఐదవది అని ఆయన తెలిపారు, సింగపూర్ కి చెందిన టెలియోస్ ఉపగ్రహం ను ప్రయోగిస్తున్నట్లు ఈ ప్రయోగం విజయం కావడానికి చెంగాళమ్మ ఆశీస్సులకోసం వచ్చినట్లు తెలిపారు, తరువాత ప్రయోగం జి ఎస్ ఎల్ వి రాకెట్ ద్వారా నావికా ఉపగ్రహ ప్రయోగం ఉంటుందని, అలాగే చంద్రయాన్ త్రీ ప్రయోగం ,ఆదిత్య ప్రయోగాలు ఉంటాయని ఆయన తెలియజేసారు.ఈ కార్యక్రమం లో ఆలయ ట్రస్ట్ సభ్యులు ముప్పాళ్ల చంద్ర శేఖర్ రెడ్డి,వంకా దినేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Post a Comment