సామజిక న్యాయ వైతాళికుడు మ‌హాత్మా జ్యోతిరావు పూలే - తిరుపతి ఎంపీ గురుమూర్తి



 

సామజిక న్యాయ వైతాళికుడు మ‌హాత్మా జ్యోతిరావు పూలే - తిరుపతి ఎంపీ గురుమూర్తి

రవి కిరణాలు, తిరుపతి, ఏప్రిల్ 11:-

స‌మాజంలో అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల స‌మాన‌త్వాన్ని కాంక్షించి స‌మ‌స‌మాజ స్థాప‌న‌కు కృషి చేసిన మ‌హ‌నీయుడు మ‌హాత్మా జ్యోతిరావు పూలే అని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి అన్నారు. నేడు మహాత్మా జ్యోతిరావు పూలే గారి 197వ జయంతి సందర్భంగా తిరుపతి బాలాజీ కాలనీ లోని మ‌హాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ మహాత్మ జ్యోతి రావు పూలే సమసమాజ స్థాపనకై అహర్నిశలు కృషి చేసి, కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన ధీశాలి అని కొనియాడారు. వర్ణ వివక్షను రూపుమాపడం కోసం, దళిత, బహుజన, మహిళా వర్గాల అభ్యున్నతి కోసం, మహాత్మా ఫూలే కార్యాచరణ మహోన్నతమైనదని, కుల,లింగ వివక్షకు తావు లేకుండా అంద‌రికీ విద్య, సమానత్వం ద్వారానే సామాజిక ఆర్థిక సమున్నతికి బాటలు పడతాయనే విశ్వాసాన్ని నమ్మిన గొప్ప మేధావి అని ఆయన అన్నారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget