స్పందన వేదికను సద్వినియోగం చేసుకోండి
- గౌరవ మేయర్ శ్రీమతి స్రవంతి మరియు ఇంచార్జ్ కమిషనర్ చెన్నుడు
ప్రజా సమస్యల పరిష్కార వేదికగా నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రతీ సోమవారం నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమం నిర్వహించడమైనది. ఈ కార్యక్రమంలో భాగంగా నగరపాలక సంస్థ అన్ని విభాగాల అధికారులతో కార్యాలయంలోని డాక్టర్ ఎ.పి.జె అబ్దుల్ కలాం సమావేశ మందిరంలో సోమవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించడమైనది. స్పందన వేదికలో ప్రజలనుంచి వచ్చిన విజ్ఞప్తులను నిర్దిష్ట గడువులోపు సంబంధిత విభాగం అధికారులు పరిష్కారం అందించాలని ఆదేశించారు. నగరపాలక సంస్థ పరిధిలోని ఆస్థి, కుళాయి, డ్రైను, ఖాళీ స్థలం, వాణిజ్య ప్రకటనల పన్నులతో పాటు ప్రతి ఇంటి నుంచి యూజర్ చార్జిల వసూళ్లకై నిర్దేశించిన లక్ష్యాలను వంద శాతం పూర్తి చేయాలని సంబంధిత విభాగాల అధికారులను ఆదేశించారు. వర్తక వాణిజ్య దుకాణాలన్నింటికీ ట్రేడ్ లైసెన్సులు మంజూరు చేసి, పన్ను పరిధిలోకి తీసుకురావాలని సూచించారు.
నగర వ్యాప్తంగా అన్ని డివిజనుల్లో జనావాసాల మధ్య పందుల సంచారాన్ని నియంత్రించాలని, ప్రత్యేక ప్రదేశాలకు వాటిని తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో (క్లాప్) భాగంగా ప్రతీ ఇంటినుంచి ప్రణాళికాబద్ధంగా చెత్తను సేకరించాలని, యూజర్ చార్జీల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు ఆదేశించారు.
జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష రీ సర్వే పనులను వేగవంతం చేయాలని, సర్వేలో అన్ని వివరాలను సమగ్రంగా పొందుపరచాలని, సచివాలయాల వారీగా రీ సర్వే పనులను పూర్తి చేసి, రికార్డులను పదిలపరచాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మునిసిపల్ ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకట రమణ, ఇంజనీరింగ్ విభాగం ఎస్ ఈ సంపత్ కుమార్ , సంజయ్ ఈ.ఈ, చంద్రయ్య ఈ.ఈ, ఇతర విభాగాల ఉన్నతాధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Post a Comment