నెల్లూరు మార్చి 20
స్పందన అర్జీలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ శ్రీ కెవిఎన్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు.
సోమవారం ఉదయం నెల్లూరు నగరంలోని కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ శ్రీ కెవిఎన్ చక్రధర్ బాబు, సంయుక్త కలెక్టర్ శ్రీ రోణంకి
కూర్మనాద్, డిఆర్ఓ శ్రీమతి వెంకటనారాయణమ్మలతో కలిసి స్పందన కార్యక్రమం నిర్వహించి వివిధ ప్రాంతాల ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్
సంబంధిత శాఖల జిల్లా అధికారులను పిలిపించి అర్జీల పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకోవాలని సూచించారు.
అంతకు మునుపు జిల్లా కలెక్టర్ స్పందన అర్జీల పరిష్కారం,
ఉద్యోగుల ముఖ హాజరు, గృహ నిర్మాణం, పంట నష్టం, ధాన్యం సేకరణ, హెచ్ 3 ఎన్ 2 ఫ్లూ వైరస్, గడపగడపకు మన ప్రభుత్వం తదితర కార్యక్రమాలపై జిల్లా అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి గురువారం అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అంశాల పురోగతిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్షిస్తున్నారన్నారు.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రానికి వస్తున్నారని వారి అర్జీలను అత్యంత ప్రాధాన్యతతో వీలైనంత వరకు సానుకూలంగా పరిష్కరించాలని సూచించారు.
ఇంకా కొంతమంది జిల్లా అధికారులు వారి స్పందన లాగిన్లు తెరవడం లేదని వాటిని వెంటనే తెరిచి ప్రజల అర్జీలను పరిష్కరించేందుకు తగిన చర్యలు చేపట్టాలన్నారు.
కొన్ని ప్రభుత్వ శాఖల్లో పరిష్కరించిన అర్జీలు మరలా వస్తున్నాయని అలా మరల వస్తున్న పరిష్కరించిన అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి సంబంధిత అర్జీదారులను పిలిపించి పరిష్కారం చేయగలిగినవి చేయాలని లేని పక్షంలో ఎందువలన పరిష్కారం చేయలేకపోతున్నామో స్పష్టంగా వివరించాలని, వారు మరల అర్జీ చేసుకున్న చేసుకోకుండా చూడాలన్నారు.
జిల్లాలో పంచాయతీరాజ్, రిజిస్ట్రేషన్, పురపాలక, ఇంటర్మీడియట్, తెలుగు గంగ, గృహ నిర్మాణం, సాంఘిక సంక్షేమం తదితర కొన్ని శాఖల్లో ఇంకా ఉద్యోగుల ముఖ హాజరు నమోదు కార్యక్రమం పూర్తిస్థాయిలో కాలేదని దానిపై ప్రత్యేక దృష్టి సారించి తక్షణమే నమోదు కార్యక్రమం పూర్తి చేయాలన్నారు. వచ్చే నూతన ఆర్థిక సంవత్సరంలో జీతాలకు ముఖ హాజరు అనుసంధానం చేస్తారని ఆలోగా తప్పనిసరిగా ఉద్యోగులందరూ ముఖ హాజరు నమోదు చేసుకుని ప్రతిరోజు హాజరు వేసేలా జిల్లా అధికారులు పర్యవేక్షించాలన్నారు. ఇంకా ముఖ హాజరు నమోదు పూర్తి చేసుకోని జిల్లా అధికారులు ఈ- జిల్లా మేనేజర్ శ్రీరాములుతో సమన్వయం చేసుకోవాలన్నారు.
పేదలందరికీ ఇళ్లు గృహ నిర్మాణ కార్యక్రమం ఈనెల 22 తేదీ నుండి వచ్చే ఏప్రిల్ నెల 15వ తేదీకి షెడ్యూలు మార్చడం జరిగిందని చెప్పారు.
ఆర్.ఎల్., ఆర్.సి. పై కప్పు స్థాయికి వచ్చిన గృహాలన్నిటిని పూర్తిచేసేందుకు తగిన చర్యలు చేపట్టాలన్నారు. ఇందుకోసం మండల ప్రత్యేక అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
గృహాల లబ్ధిదారులైన స్వయం సహాయ సంఘాల మహిళలకు విరివిగా రుణాలు అందజేసి మూడవ ఐచ్చిక గృహాలను పూర్తయ్యేలా చూడాలన్నారు.
ఇకపై ప్రతిరోజు గృహ నిర్మాణం పురోగతిపై సమీక్షిస్తామన్నారు.
ప్రతి గ్రామ వార్డు సచివాలయాలు తమకు కేటాయించిన లక్ష్యాలను సాధించేందుకు తీవ్రంగా కృషి చేయాలన్నారు.
జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటల అంచనాలను గ్రామ సచివాలయాల పరిధిలో సామాజిక తనిఖీ ద్వారా పక్కాగా తయారుచేసి నష్టపరిహారం కోసం వారం రోజుల్లోగా నివేదిక సిద్ధం చేయాలన్నారు.
జిల్లాలో ధాన్యం సేకరణకు సంయుక్త కలెక్టర్ ను సంప్రదించి అవసరమైన చోట్ల ఏర్పాట్లు చేయాలన్నారు.
హెచ్ 3ఎన్ 2 ఫ్లూ వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని
అందరూ విధిగా మాస్కులు ధరించాలని సామాజిక దూరం పాటించాలని సానిటైజర్ వినియోగించాలని సూచించారు
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంజూరైన పనులను వెంటనే చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ముఖ్యంగా నాడు నేడు భవనాల నిర్మాణం పనులు వచ్చే ఏప్రిల్ 15 నాటికి పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు.
వివిధ ప్రభుత్వ శాఖల మధ్య తలెత్తే సమస్యల ను స్పందన కార్యక్రమం సందర్భంగా పరిష్కరించుకోవాలన్నారు.
ఈనెల 25వ తేదీ నుండి వారం రోజులపాటు వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమాన్ని
సంబంధిత శాసనసభ్యులతో సంప్రదించి నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో శ్రీ బి.చిరంజీవి, డి ఆర్ డి ఏ, డ్వామా, ఏపీఎంఐపీ, గృహ నిర్మాణసంస్థ పీడీలు శ్రీ కె.వీ. సాంబశివరెడ్డి, శ్రీ వెంకటరావు, శ్రీ శ్రీనివాసులు, శ్రీ వెంకట దాసు, డి టి సి శ్రీ బి చందర్, ఆర్ డబ్ల్యు ఎస్, పంచాయతీ రాజ్, జలవనుల శాఖ ఎస్. ఈ. లు శ్రీ రంగవర ప్రసాద్, శ్రీ అశోక్ కుమార్, శ్రీ కృష్ణమోహన్, డిఇఓ శ్రీమతి గంగాభవాని, డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ పెంచలయ్య, జిల్లా వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు శ్రీ సుధాకర్ రాజు, శ్రీ సుబ్బారెడ్డి, జిల్లా రిజిస్ట్రార్ శ్రీ బాలాంజనేయులు, విద్యుత్ శాఖ ఎస్.ఈ. శ్రీ వెంకటసుబ్బయ్య తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు
జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి, నెల్లూరు వారిచే జారీ చేయబడినది
Post a Comment