"మహాభారతంలో శకుని సోమిరెడ్డి" - మందల వెంకటశేషయ్య యాదవ్.
తనపై టిడిపి నాయకుడు గుమ్మా రాజ్ గోపాల్ చేసిన దౌర్జన్యాన్ని మీడియా ముందు వివరించిన పిల్లెల పెంచల యాదవ్.
నెల్లూరు జిల్లా:
వెంకటాచలం మండల వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో సోమిరెడ్డి యాదవులపై చేస్తున్న అబద్ధపు ప్రచారాన్ని తిప్పికొట్టిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మందల వెంకట శేషయ్య యాదవ్.
వెంకటశేషయ్య యాదవ్ మాట్లాడుతూ...
సర్వేపల్లి నియోజకవర్గంలోని యాదవులందరినీ అర్థిస్తున్నా.. సోమిరెడ్డిని తరిమికొట్టండి. మనలో మనకే తగువులు పెట్టడం సోమిరెడ్డి నైజం. మనలో వర్గాలు చీల్చి రెచ్చగొట్టి సోమిరెడ్డి రాజకీయ లబ్ది పొందుతున్నాడు. గతంలో జెడ్పిటిసిగా ఉన్న నాపై యాదవుడినని సోమిరెడ్డి చిన్నచూపుతో తప్పుడు కేసులు పెట్టించలేదా..! రాజా యాదవ్ ప్రస్తుత టిడిపి మండల అధ్యక్షుడు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు సోమిరెడ్డి నానా ఇబ్బందులు పెట్టిన విషయం మర్చిపోయాడా..! యాదవ కులానికి చెందిన చెముడుగుంట మహిళ సర్పంచ్ చెక్ పవర్ ను రద్దు చేసి, పనులు చేయనివ్వకుండా, డబ్బులు రానివ్వకుండా, అడ్డుపడి ఆర్థికంగా దెబ్బతీసింది సోమిరెడ్డి కాదా! రాజగోపాల్ ను అరెస్టు చేశారంటూ గగ్గోల పెట్టే సోమిరెడ్డి, గుమ్మా రాజగోపాల్ కొట్టింది యాదవ సోదరుడ్ని కాదా..! కూలీ కష్టం చేసుకొనే తోటి యాదవుల డబ్బులు దోచుకోవడం సమంజసమా! తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరితే మీ నాయకుడు వారిపై దౌర్జన్యం చేయడం నువ్వు ప్రోత్సహిస్తున్నావా! సోమిరెడ్డీ. రాజగోపాల్ కు వైసిపి పార్టీలో ఉపసర్పంచ్ గా పదవి ఇచ్చి సముచిత స్థానం కల్పించింది గోవర్ధన్ రెడ్డి కాదా..!
ఆనాడు నీ అధికారాన్ని అడ్డుపెట్టుకొని, నీ వెంట పట్టుకొని వెళ్లావు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు నీలాంటి పనులు చేయలేదు, గొడవలు సృష్టించలేదు కదా. గ్రామాల్లో గొడవలు సృష్టించే బుద్ధి సోమిరెడ్డిది అలాంటి అలవాటు మా నాయకునికి లేదు. సర్వేపల్లి నియోజకవర్గంలో యాదవులకు సముచిత స్థానం అందించిన ఘనత మా నాయకుడు గోవర్ధన్ రెడ్డి గారిది సోమిరెడ్డీ.. నీ జీవితంలో ఎప్పుడైనా యాదవులకు సముచిత స్థానం కల్పించగలిగావా..!
సోమిరెడ్డి నువ్వు చెప్పగలవా..! యాదవుల గురించి మాట్లాడే అర్హత నీకు ఉందా సోమిరెడ్డి...! అధికారులతో నువ్వు మాట్లాడే భాష ఎవరూ మాట్లాడలేరు. నెల్లూరు నగరంలో పోలీసు ఇన్స్ పెక్టర్ ను బహిరంగంగా దుర్భాషలాడిన నీచచరిత్ర నీది.మహిళా అధికారులను నీ వికృత చేష్టలతో ఎంత మానసిక క్షోభకు గురిచేశావో గుర్తుందా..!సమాజంలో గౌరవప్రదమైన స్థానంలో ఉండే వైద్యురాలితో నువ్వు ప్రవర్తించిన తీరు మర్చిపోయావా..! నువ్వా సోమిరెడ్డి..నీతులు చెప్పేది అటువంటి భాష మాకు రాదు.ప్రతి ఒక్కరితో మంచిగా మాట్లాడే గుణం మా నాయకుడు గోవర్ధన్ రెడ్డి గారిది.
వెంకటాచలంలో నేడు ఒక బలమైన వర్గంగా ఏర్పడిన యాదవుల మధ్య గొడవలు సృష్టించి, సోమిరెడ్డి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాడు. సోమిరెడ్డి యాదవులను దెబ్బతీయాలని వ్యూహలు రచ్చించి, గొడవలు సృష్టిస్తున్నాడు. యాదవ సోదరులు అందరూ సోమిరెడ్డి కుతంత్రాలను గుర్తించండి. మహాభారతంలో కౌరవులను నాశనం చేసిన శకుని పాత్ర నేడు సోమిరెడ్డి పోషిస్తున్నాడు. యాదవులలో చిచ్చురేపి, యాదవులను నాశనం చేయాలని సోమిరెడ్డి చూస్తున్నాడు. కులాలను అడ్డుపెట్టుకొని రాజకీయంగా ఎదగాలని యాదవుల మధ్య గొడవలు సృష్టించడం మానుకోవాలని సోమిరెడ్డి కి హితవు చెబుతున్నాం.
Post a Comment