కోటపోలూరులో గ్రామంలో సచివాలయం ప్రారంభించిన ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య







 కోటపోలూరులో గ్రామంలో సచివాలయం ప్రారంభించిన ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య .

 అక్క, చెల్లమ్మలకు మూడవ విడత ఆసరా చెక్కు పంపిణి.

 అనిల్ రెడ్డి అద్వర్యం లో బారి బైక్ ర్యాలీ.

కోటపోలూరు లో పండుగ వాతావరణం.

రవి కిరణాలు, సూళ్లూరుపేట మార్చి 29:-

సూళ్లూరుపేట మండల పరిధిలోని కోటపోలూరు గ్రామంలో బుధవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం 100వ రోజున పురస్కరించుకొని సూళ్లూరుపేట మండల అధ్యక్షుడు అల్లూరు అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ చేశారు. ఈ ర్యాలీ లో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య  స్వయంగా బైక్ నడుపుతూ అందరి దృష్టిని ఆకర్షించారు. ఎన్నికల ప్రచారాన్ని తలపిస్తూ ఎమ్మెల్యే 

కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని తెచ్చారు, కోటపోలూరు జాతీయ రహదారి జంక్షన్ నుండి ప్రారంభమైన 

బైక్ ర్యాలీ అందరి దృష్టిని ఆకర్షించింది. కోటపోలూరు వరకు సాగిన బైక్ ర్యాలీ అనంతరం ఎమ్మెల్యే 

కోటపోలూరు గ్రామంలో ఉన్న స్వర్గీయ వైయస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు . అనంతరం 

డాక్టర్ బి ఆర్  అంబెడ్కర్ విగ్రహానికి కూడా పూలమాల వేశారు. అనంతరం 40 లక్షల రూపాయిల తో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనాన్ని ఎమ్మెల్యే చేతులు మీదుగా ప్రారంభించారు. 

అనంతరం ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి నేతృత్వం లో మూడవ విడత ఆసరా  పంపిణి సమావేశం లో కూడా ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పాల్గొని జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు,ఈ సందర్భముగా సీఎం వై యస్ జగన్ మోహన్ రెడ్డి ఫొటోకు 

పాలాభిషేకం చేశారు, కేకు కట్ చేసి అందరికి పంచిపెట్టారు, ఆసరా చెక్కును లబ్దిదారులకు ఎమ్మెల్యే చేతులు మీదుగా అందజేశారు. ఈ సందర్భముగా అయన మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో పేద ప్రజలు జగనన్న పక్షాన నిలిచారు కాబట్టే వైయస్సార్సీపి రాష్ట్రంలో ఘన విజయం సాధించిందని ఆయన  అన్నారు. పాదయాత్రలో జగనన్న ప్రజల కష్టాలను చూసి నేను విన్నాను నేను ఉన్నాను అని చెప్పి నేడు పేద ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్నారని ,పేద ప్రజల సంక్షేమం కోసం ఇంతగా పాటుపడుతున్న ముఖ్యమంత్రి జగనన్నకు మహిళలు మరోసారి బ్రహ్మరథం పట్టాలని ఎమ్మెల్యే సంజీవయ్య ప్రజలను విజ్ఞప్తి చేశారు. 

ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట ఆర్డీవో చంద్రముని, తాసిల్దార్ రవికుమార్, ఎంపీడీవో ప్రమీల రాణి తో పాటు చెంగాళమ్మ ఆలయ చైర్మన్ దువ్వూరు బాలచంద్ర రెడ్డి,

తడ ఎంపీపీ రఘు,జెట్టి వేణు యాదవ్,మునిసిపల్ వైస్ ప్రెసిడెంట్లు చిన్ని సత్యనారాయణ,

పోలూరు పద్మ,కౌన్సిలర్ మిజురు రామకృష్ణ రెడ్డి, అల్లూరు రమేష్ రెడ్డి,బద్దెపూడి మోహన్ రెడ్డి,కే మాధవ రెడ్డి,రాజారెడ్డి,కోటపోలూరు సర్పంచ్ కమతం అరుణ కుమారి, ఐత శ్రీధర్, 

అలవల సురేష్  తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget