వైభవముగా శ్రీ సీతా రాముల కళ్యాణం మహోత్సవం.
జై శ్రీరామ్ అనే నామాలతో నిండిన ఆలయం.
కళ్యాణాన్ని వీక్షించిన అశేష భక్త జనులు.
రవి కిరణాలు సూళ్లూరుపేట మార్చి 30:-
సూళ్లూరుపేట లో వెలసి ఉన్న శ్రీ బాలాంజనేయ స్వామి ఆలయం లో జరుగుతున్న
శ్రీరామ నవమి వసంతోత్సవాలలో భాగంగా గురువారం శ్రీ సీతా రాముల కళ్యాణం
అంగరంగ వైభవముగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవం అశేష భక్త జన సందోహము నడుమ ఆలయ అధికారులు నిర్వహించారు. అనంతరం స్వామి వారి కళ్యాణాన్ని భక్తులు కనులారా వీక్షించి తరించారు. ఆలయ ప్రధాన అర్చకులు దీవి లక్ష్మీనారాయణ సారధ్యం లో ఆలయ చైర్మన్ ఐతా శ్రీధర్ పర్యవేక్షణలో ,ట్రస్ట్ బోర్డు సభ్యుల సహకారం తో ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. సీతా రాముల కళ్యాణం లో భాగంగా
వేదపండితులు కళ్యాణ సాంప్రదాయాలను పాటిస్తూ స్వామి వారికి ఎదురుకోల ఉత్సవాన్ని
జరిపించారు.ఈ ఎదురుకోల ఉత్సవం లో వేదపండితులు పూలమాలలు తలపై పెట్టుకుని
చేసిన నృత్యం అందరి దృష్టిని ఆకర్షించింది,అనంతరం సీతా రాములను ఒకటిగా చేర్చి
నూతన వస్త్రాలు సమర్పించారు. తదనంతరం స్వామివార్లకు కన్యాదానం చేసి జిలకరా బెల్లం పెట్టి, మాంగళ్యధారణ
చేశారు, అనంతరం తలంబ్రాల వేడుకను జరిపించారు, ఈ వేడుకల్లో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ,చెంగాళమ్మ ఆలయ ట్రస్ట్ చైర్మన్ దువ్వూరు బాలచంద్ర రెడ్డి,పట్టణ వైసీపీ
అధ్యక్షుడు కళత్తూరు శేఖర్ రెడ్డి,మునిసిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి,శివాలయం చైర్మన్ చెన్నారెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి, గోగులు తిరుపాల్ తదితరులు పాల్గొన్నారు.
Post a Comment