అమరావతి : సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలసి బీ ఫాంను అందుకున్న సాంప్రదాయ మత్స్యకారుడు కోలా గురువులు
- సచివాలయంలోని అసెంబ్లీ భవనంలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కోలా గురువులు
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలిలో ఈనెలాఖరుకు ఖాళీ అవుతున్న ఏడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఏడుగురు అభ్యర్ధులు వారి నామినేష్లను ధాఖలు చేశారు. మొదటగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలసి బీ ఫాంను అందుకున్నారు. అనంతరం వెలగపూడిలోని అసెంబ్లీ భవనానికి చేరుకొని రాష్ట్ర శాసన మండలి సంయుక్త కార్యదర్శి మరియు ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి పివి.సుబ్బారెడ్డి వద్ద వారు నామినేషన్లు ధాఖలు చేశారు. నామినేషన్లు దాఖలు చేసిన వారిలో వరుసగా కోలా గురువులు ( సాంప్రదాయ మత్స్యకారుడు ), జయమంగళ వెంకటరమణ, మర్రి రాజశేఖర్, సీహెచ్.ఏసురత్నం, బొమ్మి ఇజ్రాయిల్, పోతుల సునీత, పెనుమత్స వరాహ వెంకట సూర్యనారాయణ రాజులు రిటర్నింగ్ అధికారికి వారి నామినేష్లను సమర్పించారు.
Post a Comment