చెరువులా తలపిస్తున్న సూళ్లూరుపేట
చిన్నపాటి వర్షానికి పట్టణ రోడ్లు జలమయం.
వాహనదారులకు తప్పని తిప్పలు.
తిరుపతి జిల్లా, రవికిరణాలు మార్చి 20,:-
సూళ్లూరుపేట పట్టణం లో సోమవారం మధ్యాహ్నం గంట పాటు ఈదురుగాలుల తో కురిసిన బారి వర్షం కారణముగా రోడ్లన్నీ జలమయం గా మారాయి, గాండ్ల వీధి, సాయినగర్ సెంటర్,హోలీ క్రాస్ సెంటర్ తో పాటు వినాయకుని గుడి సెంటర్లో ,మార్కెట్ సెంటర్లోనూ
రోడ్లన్నీ వర్షపు నీటితో నిండిపోవడం తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డ్రైనేజీ కాలువలు సరిగా లేనందువలన వర్షపు నీరు డ్రైనేజీ రోడ్లన్నీ జలమయమయ్యాయి.అదేవిధంగా షార్ రోడ్డు, వై జంక్షన్ నుంచి కోర్టు బిల్డింగ్ ముందు ఆవరణం మీదుగా కె అర్ పి కాలనీ వరకు రోడ్డుపై విపరీతమైన నీటి ప్రవాహం సంభవిస్తుంది. దీనికి కారణం సూళ్లూరుపేట పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం అని పట్టణ పుర ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వర్షం కురిసే ఆసమయం లో పాదాచారులకు, వాహనాలకు విపరీతమైన అసౌకర్యం ఏర్పడుతుంది. ఇకనైనా ప్రజాప్రతినిధులు, పురపాలక సంఘం అధికారులు స్పందించి సూళ్లూరుపేట పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థను నిర్మించాలని పురప్రజలు కోరుకొంటున్నారు.
Post a Comment