చందనాలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన చెంగాలమ్మ తల్లి
చందనాలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన చెంగాలమ్మ తల్లి.
సూళ్లూరుపేట మార్చి 22 (రవి కిరణాలు) :-
కాళ్ళంగి నది ఒడ్డున వెలసి ఉన్న భక్తులకు బంగారం కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి దక్షిణముఖ కాళీ శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానము నందు శోభకృతు నామ సంవత్సర ఉగాది సందర్భముగా శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారు చందన అలంకారములో భక్తులకు నిజరూప దర్శనభాగ్యం కల్పించుట జరిగినది. ఈ సందర్భముగా శ్రీ అమ్మవారికి వేద పండితులచే లక్ష కుంకుమార్చన పూజ ఘనముగా నిర్వహించుట జరిగినది. దేవాలయమును విశేష పుష్పాలంకరణ చేయుట జరిగినది. చైర్మన్ దువ్వూరు బాల చంద్రారెడ్డి జ్యోతి ప్రజ్వలనతో వేడుకలను ప్రారంభించుట జరిగినది. పర్వదిన ఉభయకర్తలు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, శ్రీ మాగుంట సుధాకర్ రెడ్డి, శ్రీ మాగుంట సుబ్బరామిరెడ్డి గార్లు, పుష్పాలంకరణ ఉభయకర్తలు R900, నెల్లూరు వారు, చందన అలంకరణ ఉభయకర్తలు శ్రీ చెన్నూరి రాంబాబు శ్రీమతి సత్య కుమారి, బ్రేకుఇన్స్పెక్టర్,సూళ్ళూరుపేట వారు, లక్షార్చన పూజ ద్రవ్యములు శ్రీ చిట్టేటి పెరుమాళ్ళు శ్రీమతి గోవిందమ్మ గార్లు, అన్నదానం శ్రీ దేవారెడ్డి మునికృష్ణారెడ్డి శ్రీమతి రాజేశ్వరి గార్లు ఉభయకర్తలుగా వ్యవహరించుట జరిగినది. స్వర్ణ కిరీట, చందనాలంకారణ శోభిత శ్రీ అమ్మవారిని శాసన సభ్యులు, శ్రీ కిలివేటి సంజీవయ్య గారు దర్శించుకొన్నారు, భక్తులు అదిక సంఖ్యలో దర్శించుకొన్నారు. భక్తులకు తగినటువంటి ఏర్పాట్లు కార్యనిర్వహణాధికారి ఆళ్ళ శ్రీనివాస రెడ్డి పర్యవేక్షణ చేయుట జరిగినది. ఈ కార్యక్రమంలో ధర్మకర్త మండలి సభ్యులు ముప్పాళ్ల చంద్ర శేఖర్ రెడ్డి, వంక దినేష్ కుమార్, శ్రీమతి బండి సునీత, బాల సత్యనారాయణ, కర్లపూడి సురేష్ బాబు, శ్రీమతి మన్నేముద్దు పద్మజ, శ్రీమతి నాయుడు కుప్పం నాగమణి తదితరులు పాల్గొన్నారు
Post a Comment