అంగన్వాడీల అక్రమ అరెస్టులను ఖండించండి
మర్చి 20న అంగన్వాడీలు తన న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం చలో విజయవాడకి బయలుదేరిన అంగన్వాడీలను ఎక్కడికి అక్కడ అరెస్టు చేయడా న్ని నిరసిస్తూ అంగన్వాడి వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నెల్లూరు నగరం గాంధీ బొమ్మ వద్ద నిరసన కార్యక్రమం చేయడం జరిగినది
ఈ సందర్భంగా సిఐటియు నెల్లూరు నగర కార్యదర్శి G. నాగేశ్వర రావు మాట్లాడుతూ అంగన్వాడీలు శాంతియుతంగా తన డిమాండ్ల పరిష్కరించాలని చలో విజయవాడకి పిలుపునిస్తే వారి వీళ్ళకి పోలీసు వెళ్లి నోటీసులు ఇస్తామని బెదిరించడం, బస్సులో ఎక్కిన వారిని అరెస్టులు చేయడం, రైల్లో పోయేటటువంటి వాళ్ళని మధ్యలో ఆపేసి అరెస్టులు చేయడం, విజయవాడ రైల్వే స్టేషన్లో ఉన్న వారిని బయటికి వెళ్లకుండా అడ్డుకొని రైల్వే స్టేషన్ లోనే నిర్బంధించడం పిరికిపంద చర్య అన్నారు
జగన్మోహన్ రెడ్డి అధికారం లోనికి రావడానికి అంగన్వాడీలకు అనేక హామీలు ఇవ్వడం జరిగింది అన్నారు తెలంగాణ ప్రభుత్వం కన్నా మన ప్రభుత్వం అధికారం లేక వస్తే ఎక్కువ జీతాలు ఇస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు అమలు చేయలేదు అన్నారు తెలంగాణలో2021నుండి వర్క్ కీ 13650 రూపాయలు ఇస్తుంటే మన ప్రభుత్వం11500 రూపాయలు ఇస్తుంది అన్నారు, అంగన్వాడీలకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటి ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 ఐదు లక్షలు ఇవ్వాలని, జీవితంలో సగంభాగం పెన్షన్ ఇవ్వాలని, దేశి యాప్ రద్దు చేయాలని పర్యవేక్షణ పేరుతో వేధింపులు ఆపాలని వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ మెనూ చార్జీలు పెంచాలని గ్యాస్ ను ప్రభుత్వ సెంటర్లకు సరఫరా చేయాలని 2017 నుండి పెండింగ్లో ఉన్న టిఏ బిల్లులను వెంటనే ఇవ్వాలని లబ్ధిదారులకు నాణ్యమైన ఆహారాన్ని సరఫరా చేసేందుకు ఆయలు కందిపప్పు క్వాంటిటీ పెంచాలని అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయాలని చలో విజయవాడకు పోయినటువంటి అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ అని బేసరత్తుగా విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో సిఐటియు రూరల్ కార్యదర్శి కిన్నెర కుమార్, ఐద్వా నగర కార్యదర్శి కే పద్మ డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు బిపి నరసింహ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు కామాక్షమ్మ, సంపూర్ణమ్మ, మైదిలి, శైలజ మల్లెమ్మ, కళ్యాణి, మాధవి ఐద్వా నాయకులు కుమారమ్మ, రెహను మా, డివైఎఫ్ఐ నాయకులు కర్తం బాబు తదితరులు పాల్గొన్నారు
Post a Comment