"మంత్రి కాకాణితో సమావేశమైన జిల్లాల సహకార బ్యాంకుల అధ్యక్షులు"
వెలగపూడి: మార్చి 19,2023
సహకార వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మాత్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు.
ఆదివారం స్థానిక సచివాలయం రెండో బ్లాక్ సమావేశ మందిరం నందు రాష్ట్రంలోనీ అన్ని జిల్లాల కేంద్ర సహకార బ్యాంకుల పర్సనల్ ఇన్చార్జిలతో సమావేశమై సహకార రంగంపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ,ఆప్కాబ్, డిసిసిబి బ్యాంకులకు ఒకే సర్వీస్ రూల్స్ వర్తించేలా రాష్ట్రస్థాయిలో ఒక పాలసీనీ రూపొందించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కోపరేటివ్ బ్యాంకులు రైతులకు అన్ని విధాలుగా అండగా ఉండాలన్నారు. రైతులకు రుణాలను ఇవ్వడంలో మొదటి ప్రాధాన్యతను ఇస్తూ, బహిరంగ మార్కెట్లో ఇతర ఆర్థిక లావాదేవీలను నిర్వహించుకోవచ్చు అన్నారు. వాణిజ్య బ్యాంకులకు దీటుగా కోపరేటివ్ బ్యాంకులను ప్రత్యేక బ్రాండింగ్ తో ఆధునికరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఖాతాదారులను, డిపాజిట్లను పెంచుకోవడానికి దృష్టి సారించాలన్నారు. రైతులు రుణాలను పొందేందుకు, తిరిగి చెల్లించేందుకు పూర్తి అవగాహన కల్పించాలన్నారు. ఆప్కాబ్, సెంట్రల్ బ్యాంక్ లు బాగా పనిచేస్తున్నాయని అదే స్థాయిలో పరపతి సంఘాలు కూడా పనిచేయడానికి కృషి చేయాలనీ మంత్రి కోరారు.
ఈ సమావేశంలో ఆప్కాబ్ చైర్మన్ శ్రీమతి ఎం.ఝాన్సీ రాణి, ఆప్కాబ్ ఎండి డాక్టర్ ఆర్.శ్రీనాథ్ రెడ్డి,వివిధ జిల్లాల డిసిసిబి చైర్మన్లు, తదితరులు పాల్గొన్నారు.
Post a Comment