జనతా కర్ఫ్యూ కు నేటితో మూడేళ్ళు పూర్తి....
22-3-2020 న 14 గంటల పాటు అమలు....
కరోనా కష్టకాలంలో మంత్రి కాకాణి....
సర్వేపల్లి నియోజకవర్గం లో.....
చేపట్టిన సేవలు చిరస్మరణీయం....
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో భారత దేశంలో జనతా కర్ఫ్యూ అమలు చేసి నేటికి సరిగ్గా మూడేళ్లు పూర్తయ్యాయి. 2020 సంవత్సరం మార్చి 22వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 14 గంటల పాటు ఈ కర్ఫ్యూను పాటించారు. కరోనా నియంత్రణకు క్షేత్రస్థాయిలో పని చేస్తున్న వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బందికి మద్దతుగా దేశవ్యాప్తంగా ప్రజలంతా సాయంత్రం 5 గంటలకు తమ ఇళ్లల్లో నుంచి బయటకు వచ్చి చప్పట్లతో తమ సంఘీభావం తెలిపారు. ఆ మరుసటి రోజు 23 తేదీ నుంచే లాక్ డౌన్ ప్రకటించారు. అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. మిగిలిన వారిని ఇళ్లల్లో నుంచి బయటకు రాకుండా,ఇంటికే పరిమితం చేశారు.
కాకాణి సేవలు చిరస్మరణీయం
ఈ పరిస్థితుల్లో 24వ తేదీ నుంచి సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి తన సొంత ఖర్చుతో పనులు లేక ఇళ్లల్లోనే ఉండిపోయిన నియోజకవర్గంలోని పేదలందరికీ నిత్యావసర సరుకుల తో పాటు కూరగాయలను పంపిణీ చేశారు. ఇందుకోసం ఆయన తన సొంత నిధులను ఒక కోటి మూడు లక్షల రూపాయలను వెచ్చించారు. అలాగే "సర్వేపల్లి రైతన్న కానుక" పేరుతో సర్వేపల్లి నియోజకవర్గం లోని ప్రతి పేద కుటుంబానికి ఉచితంగా బియ్యాన్ని అందజేశారు. సర్వేపల్లి రైతన్న కానుక కు రైతులతో పాటు కాకాణి కుమార్తెలు పూజితా రెడ్డి,సుచిత్రా రెడ్డి లు తమ వంతుగా 14 పుట్ల ధాన్యాన్ని విరాళంగా ఇచ్చారు. నియోజకవర్గంలోని లక్ష కుటుంబాలకు కాకాణి బియ్యంతో పాటు వంట నూనె ప్యాకెట్ లను అందజేశారు. కరోనా తీవ్రంగా ఉన్న రెడ్ జోన్ల లోనూ కాకాణి పర్యటించి, అక్కడి పేదలకు నిత్యావసర సరుకులు, కూరగాయల తో పాటు బియ్యాన్ని అందజేయడం గమనార్హం. కరోనా కష్టకాలంలో ఆయన నియోజకవర్గంలో చేసిన సేవలు చిరస్మరణీయం.ఈ సేవలతో ఆయన నియోజకవర్గ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అలాగే ఆయన సేవలు భారతదేశ చరిత్రలో నిలిచి పోయాయి. కరోనా కష్ట సమయంలో కాకాణి చేపట్టిన సేవలను జాతీయ ఆంగ్ల దినపత్రికలు కొనియాడడం విశేషం.
Post a Comment