" కాకాణి వెంట కిక్కిరిసిన జనం"
SPS నెల్లూరు జిల్లా:
తేది:08-03-2023
నిన్న, మంగళవారం నాడు, సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం, బ్రహ్మదేవి గ్రామ సచివాలయ పరిధిలో "గడప గడపకు మన ప్రభుత్వం" కార్యక్రమంలో భాగంగా, 2వ రోజు బ్రహ్మదేవి మెయిన్, బ్రహ్మదేవి గిరిజన కాలనీలలో పర్యటించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మాత్యులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.
బ్రహ్మదేవి గ్రామంలో మంత్రి కాకాణి గడపగడపకు కార్యక్రమానికి భారీ స్పందన.ముత్తుకూరు మండల కన్వీనర్ మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు. విపరీతమైన జనం రద్దీతో కార్యక్రమం కొనసాగించడానికి కూడా కష్టతరమైంది. కార్యకర్తలు చొరవ తీసుకొని జనాలను అదుపు చేయడంతో కార్యక్రమం సజావుగా, సాఫీగా సాగింది.
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నాలుగేళ్ల పరిపాలనలో ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి, గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా గ్రామాల్లో వెళ్లి, ప్రజలకు వివరించడం సాహసోపేతమైన చర్య. 2014 ఎన్నికల్లో చంద్రబాబు అనేక హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం ఆలోచన చేసిన వ్యక్తిగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో గుర్తింపు పొందారు. విశాఖలో జరిగిన సమిట్ లో పారిశ్రామికవేత్తలు జగన్మోహన్ రెడ్డి గారు చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై, ప్రశంసించడం జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పాలనకు నిదర్శనం. చంద్రబాబు ఏనాడు ప్రజల సంక్షేమం గురించి ఆలోచన చేసిన సందర్భం లేదు. చంద్రబాబు ఏనాడైనా జగన్మోహన్ రెడ్డి గారిలా అమ్మ ఒడి, రైతు భరోసా, మత్స్యకార భరోసా, కాపు నేస్తం, నేతన్న నేస్తం, ఈబిసి నేస్తం, వైయస్సార్ చేయూత, జగనన్న చేదోడు, జగనన్న తోడు లాంటి అనేక కార్యక్రమాలు ప్రజల కోసం చేయాలన్న ఆలోచన చేశాడా..!
పేదలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఆలోచన చేసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎన్నడు లేని విధంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. గ్రామంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కోట్ల రూపాయలు వెచ్చించి, సిమెంట్ రోడ్లు, సైడు డ్రైన్లు నిర్మించాం. ఆంధ్ర రాష్ట్రానికి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు రావడంతో చంద్రబాబు, చంద్రబాబు కొడుకు కుమిలి, కుమిలి ఏడుస్తున్నారు. రైతులధాన్యానికి ఎక్కువ రేటు రావడంతో, తెలుగుదేశం నాయకులు కుమిలిపోతున్నారు. తెలుగుదేశం నాయకులకు ప్రజలు బాగుండకూడదు, రైతులు బాగుపడకూడదు, రైతులకు గిట్టుబాటు ధర ఉండకూడదు, ప్రభుత్వం పై విమర్శలు చేయాలనే తపన తప్ప, ప్రజల కోసం ఆలోచన చేసే పరిస్థితిలో లేరు. గ్రామాల్లో ప్రజల స్పందన చూస్తుంటే, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పట్ల ప్రజల ఎంత సంతృప్తిగా ఉన్నారో అర్ధమవుతుంది. 2024 ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో 10కి 10 స్థానాలు గెలుచుకోవడం, జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి ముఖ్యమంత్రిని చేసుకోవడమే లక్ష్యంగా పనిచేస్తాం. ప్రజల అభివృద్ధి, సంక్షేమం, గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా పనిచేస్తాం. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నాయకులకు, కార్యకర్తలకు, గ్రామప్రజలకు, అధికారులకు పేరుపేరునా ధన్యవాదాలు.
Post a Comment