స్పందన వేదికను సద్వినియోగం చేసుకోండి - సిబ్బందికి ముఖ హాజరు తప్పనిసరి - కమిషనర్ శ్రీమతి హరిత
ప్రజా సమస్యల పరిష్కార వేదికగా నగర పాలక సంస్థ కార్యాలయంలో ప్రతీ సోమవారం నిర్వహిస్తున్న స్పందన వేదికను సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ సూచించారు. స్పందన కార్యక్రమ నిర్వహణలో భాగంగా సోమవారం 23 వినతులను ప్రజలనుంచి కమిషనర్ స్వీకరింఛి నిర్దిష్ట గడువులోపు సంబంధిత విభాగముల అధికారులను పరిష్కారం అందించాలని ఆదేశించారు.
తదుపరి నగర పాలక సంస్థ అన్ని విభాగాల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగర పాలక సంస్థ ద్వారా అందిస్తున్న వివిధ సేవలను నిర్దిష్ట సమయంలోపు పూర్తి చేయాలని కమిషనర్ సూచించారు. నగర పాలక సంస్థ పరిధిలోని ఆస్థి, కుళాయి, డ్రైను, ఖాళీ స్థలం, వాణిజ్య ప్రకటనల పన్నులతో పాటు ప్రతి ఇంటి నుంచి యూజర్ చార్జిల వసూళ్లకై నిర్దేశించిన లక్ష్యాలను వంద శాతం పూర్తి చేయాలని అన్ని విభాగాల అధికారులను కమిషనర్ శ్రీమతి హరిత ఆదేశించారు.
ఏక కాలంలో చెల్లించే పన్నుల బకాయిల మొత్తము పై వడ్డీ మాఫీ అవకాసం ఉన్నదని , పన్ను చెల్లింపుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ కోరారు.
నగర పాలక సంస్థలో విధులు నిర్వహిస్తున్న అందరు సిబ్బంది తప్పనిసరిగా ముఖ హాజరు నమోదు చేసుకోవాలని, ముఖ హాజరు విధానం ద్వారానే జీతాల చెల్లింపులు జరుగుతాయని కమిషనర్ స్పష్టం చేసారు.
క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో (క్లాప్) భాగంగా ప్రతీ ఇంటి నుంచి ప్రణాళికాబద్ధంగా చెత్తను సేకరించాలని సూచించారు.
జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష రీ సర్వే పనులను వేగవంతం చేయాలని, సర్వేలో అన్ని వివరాలను సమగ్రంగా పొందుపరచాలని కమిషనర్ ఆదేశించారు. సచివాలయాల వారీగా రీ సర్వే పనులను పూర్తి చేసి, రికార్డులను పదిలపరచాలని సూచించారు.
అన్ని డివిజనుల్లో వీధి కుక్కల నియంత్రణకై పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని, కుక్కల నియంత్రణకై ఫిర్యాదులను 9553219996 నెంబరుకు తెలియజేయాలని ప్రజలకు సూచించారు.
నగర వ్యాప్తంగా వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు చేపట్టేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించేందుకు నివేదికలు సిద్ధం చేయాలని, గుంతల ఫోటోలు, వివరాలను ఆన్లైన్ లో అప్డేట్ చేయాలని అధికారులను ఆదేశించారు. నగరములో హెచ్ 3 యెన్ 2 అను క్రొత్త వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరు తప్పని సరిగా మాస్క్ లు మరియు సానిటైజర్ ఉపయోగించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసారు.
ఈ సమీక్షా సమావేశంలో సంపత్ కుమార్ SE, చంద్రయ్య, సంజయ్, శేషగిరి రావ్ EE లు మరియు వివిధ విభాగాల ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
పి.ఆర్.ఓ
నెల్లూరు నగర పాలక సంస్థ
Post a Comment