ఘనంగా శాలివాహన చక్రవర్తి జయంతి వేడుకలు
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల పట్టణ శ్రీ వెంకటేశ్వర సాయి శాలివాహన కుమ్మర్ల సంఘం అధ్యక్షులు నడికుడి వెంకటేశ్వరరావు,ప్రధాన కార్యదర్శి రాజవరపు రాఘవేంద్రరావు,కోశాధికారి శాత్రాసుపల్లి శ్రీనివాసరావు మరియు కమిటీ సభ్యులు పెద్దల ఆధ్వర్యంలో ఈ రోజు ప్రథమాంద్ర పాలకుడు శాలివాహన శఖ పురుషుడు శాలివాహన చక్రవర్తి జయంతి సందర్భంగా పిడుగురాళ్ల పట్టణం మన్నెం పుల్లారెడ్డి హై స్కూల్ ఎదురుగా ప్రధాన రహదారిపై ఉన్న శాలివాహన చక్రవర్తి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది.ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు నడికుడి వెంకటేశ్వరరావు,ప్రధాన కార్యదర్శి రాజవరపు రాఘవేంద్రరావు,కోశాధికారి శాత్రాసుపల్లి శ్రీనివాసరావు మరియు కుమ్మర శాలివాహన సంఘం కమిటీ సభ్యులు,నాయకులు మాట్లాడుతూ ప్రథమాంద్ర పాలకుడు శాలివాహన శఖ పురుషుడు శాలివాహన చక్రవర్తి జయంతి అలాగే ఉగాది పండగ ఒకేరోజు రావడం ఎంతో సంతోషంగా ఉందని.రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో మండలాల్లో గ్రామాల్లో ఉన్న కుమ్మర శాలివాహన కుటుంబ సభ్యులందరికి కూడా ఈ ఉగాది శోభకృతు నామ సంవత్సర పర్వదినమున అంతా మంచి జరగాలని.పట్టణంలో కుమ్మర శాలివాహన సోదరులందరూ ఎంతో అన్యోన్యంగా,ఐకమత్యంతో ఏ కార్యక్రమం చేసిన ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని.అందులో భాగంగా పట్టణ ప్రధాన రహదారిపై శాలివాహన చక్రవర్తి విగ్రహన్ని ప్రతిష్టించడం జరిగిందని.రానున్న రోజుల్లో ఇప్పుడున్న ప్రభుత్వం మా కులానికి కమ్యూనిటీ హల్ కు 20 సెంట్లు స్థలాన్ని ఇస్తామని హమీ ఇవ్వడం జరిగిందని.అ స్థలం ఇవ్వడమే కాకుండా దాని కట్టుబడి నిమిత్తం 10 లక్షల రూపాయలు మా సంఘానికి అందిస్తామని చెప్పడం జరిగిందని.ఈ విషయంపై త్వరలో ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ని కలిసి ఆ నిధులు మంజూరు చెయ్యాలని కొరతమని.దాని భూమి పూజ కార్యక్రమం కూడా త్వరలో నిర్వహించే విధంగా మా సంఘ నాయకులు అందరూ కలిసి కృషి చేస్తామని తెలిపారు.తదనంతరం పాదాచారులకు పులిహార,బజ్జి,మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పట్టణ కుమ్మర శాలివాహన సంఘం కమిటీ సభ్యులు,నాయకులు,పెద్దలు తదితరులు పాల్గొన్నారు
Post a Comment