అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్లు ముఠా అరెస్ట్.
స్కూటర్, 4 లక్షల విలువచేసే 24 కేజీలు గంజాయి స్వాధీనం.
స్మగ్లర్లంతా తమిళనాడు వాసులే.
సూళ్లూరుపేట షెల్టర్ గా గంజాయి స్మగ్లింగ్.
సూళ్లూరుపేట మార్చి 09(రవి కిరణాలు):-
సూళ్లూరుపేట పట్టణాన్ని కేంద్రంగా చేసుకొని ఆంధ్ర నుండి తమిళనాడుకు గంజాయిని
అక్రమంగా తరలిస్తున్న అంతర్రాష్ట్ర స్మగ్లింగ్ ముఠాను గురువారం సూళ్లూరుపేట పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుండి నాలుగు లక్షల విలువచేసే 24 కిలోలు
గంజాయి తో పాటు ఓ స్కూటర్ ను స్వాధీనం చేసుకున్నారు.ఈ సందర్భముగా స్థానిక
పోలీస్ స్టేషన్ లో జరిగిన విలేకర్ల సమావేశం లో నాయుడుపేట డిఎస్పి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ
విశాఖ సమీపం లోని అల్లూరిసీతారామరాజు జిల్లా, చింతపల్లి మండలం,మేడూరు గ్రామం
నుండి అక్కడ ఉన్న గన్నెల రాంబాబు సహకారం తో తమిళనాడుకు చెందిన ఈశ్వరన్ రమేష్ అనే వ్యక్తి గంజాయిని సూళ్లూరుపేటకు తరలించి,పండు సక్కరై అనే వ్యక్తి అతని
కొడుకు ద్వారా తమిళనాడులోని వివిధ ప్రాంతాలకు గంజాయిని సరఫరా చేస్తున్నట్లు
సమాచారం రావడం తో పథకం ప్రకారం వారిని పట్టుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ దాడులు సూళ్లూరుపేట సీఐ వెంకటేశ్వర్ రెడ్డి, ఎస్సై లు రవిబాబు ,శేఖర్, తడ ఎస్సై జెపి శ్రీనివాసులు రెడ్డి, శ్రీహరికోట ఎస్సై మనోజ్ కుమార్ నేతృత్వం లో పోలీస్ సిబ్బందితో కలిసి గంజాయి గ్యాంగును పట్టుకోవడం జరిగిందని తెలిపారు.అరెస్ట్ ఐన వారిలో ఈశ్వరన్ రమేష్ ,గన్నెల రాంబాబు,పండు సక్కరై అతని కుమారుడు ఉన్నారు.
వీళ్ళే కాకుండా ఇంకా మరికొంత మంది ఉన్నారని త్వరలో వాళ్ళను కూడా పట్టుకోవడం
జరుగుతుందని తెలిపారు. ఈ ముఠా ఉళ్లు బెడ్ షీట్లలో గంజాయి ప్యాకెట్లను చుట్టుకొని బెడ్ షీట్లు
అమ్మే వారిలాగా వీళ్ళు గంజాయి ని ఇక్కడికి తరలించేవారని డిఎస్పీ తెలియజేసారు. అరెస్ట్ అయిన ముఠాను కోర్టులో హాజరు పరిచే రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలిపారు.
Post a Comment