జగనన్న విద్యాదీవెన: తల్లుల ఖాతాల్లోకి నగదు జమ చేసిన సీఎం జగన్‌..

 


జగనన్న విద్యాదీవెన: తల్లుల ఖాతాల్లోకి నగదు జమ చేసిన సీఎం జగన్‌..

జగనన్న విద్యా దీవెన కింద ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి నేరుగా 9.86 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.698.68 కోట్లు జమ చేశారు..

గత ప్రభుత్వం అరకొరగా ఇచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు 2017 నుండి పెట్టిన బకాయిలు రూ.1,778 కోట్లతో కలిపి ఇప్పటి వరకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన కింద ప్రభుత్వం రూ.13,311 కోట్లు సాయం అందించింది. కుటుంబంలో ఎంత మంది చదువుతుంటే అంత మందికీ ఈ పథకాలను వర్తింప చేస్తూ పేద విద్యార్థుల ఉన్నత విద్యకు అండగా నిలుస్తోంది.
సీఎం జగన్‌ ప్రసంగం:
♦సినిమాల్లో హీరోలే నచ్చుతారు.. విలన్‌లు నచ్చరు..
♦ఎన్నికుట్రలు చేసినా గెలిచేది మంచి మాత్రమే
♦చివరికి మంచి చేసిన వాడే గెలుస్తాడు
♦ఎందుకు ఈ తోడేళ్లు ఏకమవుతున్నాయి
♦పొత్తుల కోసం వీళ్లంతా ఎందుకు వెంపర్లాడుతున్నారు
♦అర్హతలేని వారు మన ప్రభుత్వంపై రాళ్లు వేస్తున్నారు
♦విలువలు లేని దుష్టచతుష్టయంతో యుద్ధం చేస్తున్నాం
♦కుటుంబం, రాజకీయ, మనవతా విలువలు లేని దుష్టచతుష్టయంతో యుద్ధం చేస్తున్నాం
♦మన ప్రభుత్వంలో డీబీటీ.. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్
♦గత ప్రభుత్వంలో డీపీటీ.. దోచుకో, పంచుకో, తినుకో..
♦కొత్తగా 14 డిగ్రీ కాలేజీలు తీసుకొచ్చాం
♦17 మెడికల్ కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయి
♦45 నెలల్లో డీబీటీ ద్వారా నేరుగా 1.9లక్షల కోట్లు అందించాం
♦ప్రతి మూడు నెలలకు ఒకసారి ఫీజులు చెల్లిస్తున్నాం
♦ఫీజులు మాత్రమే కాదు వసతి ఖర్చులు కూడా ఇస్తున్నాం
♦ఏప్రిల్ 11న రెండో విడత వసతి దీవెన నిధులు
♦ఈ పథకాలతో చదువుకునే విద్యార్థుల సంఖ్య పెరిగింది
♦జీఈఆర్ రేషియో 32 నుంచి 72 శాతానికి తీసుకెళ్లే దిశగా అడుగులు
♦ప్రభుత్వ బడులు, కార్పొరేట్ స్కూళ్లతో పోటీ పడేలా చేస్తున్నాం
♦మీ పిల్లల చదువులకు నాది బాధ్యత
♦ఉన్నత విద్యకు మరింత ఊతమిచ్చే చర్యలు తీసుకున్నాం
♦8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు అందిస్తున్నాం
♦రెండేళ్లలో ప్రభుత్వ బడులను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతాం
♦ప్రభుత్వ పాఠశాలలతో కార్పొరేట్ స్కూళ్లు పోటీపడే పరిస్థితి తెస్తాం
♦పేదలు బాగుండాలనే నవరత్నాలు ప్రవేశపెట్టాం: సీఎం జగన్‌
♦పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువే
♦ఒక మనిషి పేదరికం నుంచి బయటపడాలంటే చదువుతోనే సాధ్యం
♦ఒక కుటుంబం తలరాతను మార్చే శక్తి చదువుకు మాత్రమే ఉంది.
♦ఒక మనిషి జీవన ప్రమాణం, జీవన ప్రయాణం నిర్దేశించేది చదువే
♦కలెక్టర్‌ ఢిల్లీరావు సాధారణ కుటుంబం నంచి వచ్చిన వ్యక్తి
♦చదువుకు పేదరికం అడ్డుకాకూడదు
♦దేశంలో విద్యాదీవన, వసతి దీవెన పథకాలు ఎక్కడా లేవు
♦కాలేజీ ఫీజులు ఎంతైనా సరే పూర్తి బాధ్యత మీ జగనన్నదే
♦గత ప్రభుత్వంలో కాలేజీ ఫీజులు బకాయిలు పెట్టేవారు
♦ఫీజులు కట్టలేక చదువులు మానివేసే పరిస్థితి రాకూడదు
♦లంచాలు, వివక్ష లేకుండా తల్లుల ఖాతాల్లో విద్యాదీవెన నిధులు జమ చేస్తున్నాం
♦గతంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అరకొరగా ఇచ్చేవాళ్లు
♦ఫీజులు కట్టలేక విద్యార్థులు అవస్థలు పడేవారు
♦తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలున్నాయి
♦అందుకే విద్యార్థులందరికీ పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తున్నాం
♦జగనన్న విద్యాదీవెన ద్వారా ఇప్పటివరకు రూ.9,947 కోట్లు ఇచ్చాం
♦27 లక్షల మంది పిల్లలకు లబ్ధి చేకూర్చాం
♦చంద్రబాబు హయాంలోని బకాయిలను సైతం చెల్లించాం
♦విద్యాదీవెనతో పాటు వసతి దీవెన కూడా ఇస్తున్నాం
♦తల్లుల ఖాతాల్లో నగదు జమ చేయడం ద్వారా ప్రశ్నించే హక్కు ఉంటుంది
♦కాలేజీలో సమస్యలుంటే 1092కి ఫిర్యాదు చేస్తే మేమే మాట్లాడతాం..

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget