సిలిండర్ పేలి ఐదుగురికి గాయాలు .
గాయపడిన వారు పానీపూరి వ్యాపారి కుటుంబం.
ప్రమాదంలో గాయ పడిన భార్యా భర్తలు, ముగ్గురు పిల్లలు.
ఇద్దరి పరిస్థితి విషమం చెన్నై కి తరలింపు
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట అక్టోబర్ 1 (రవికిరణాలు):-
సూళ్లూరుపేట పట్టణం లోని మహాదేవయ్య నగర్ లో కాపురం ఉంటున్న ఉత్తరప్రదేశ్ కు
చెందిన పానీపూరి వ్యాపారి బాహిద్ ఇంటి లో సిలిండర్ పేలిన దుర్ఘటనలో ఐదుగురు
గాయపడ్డారు. బాహిద్ ఇంటిలో పెద్ద సిలిండర్ నుండి చిన్న సిలిండర్ లోకి
గ్యాస్ నింపుతుండగా సిలిండర్ పేలి ప్రమాదం జరిగింది. సిలిండర్ పేలడం తో ఇంటిలో
అగ్నిప్రమాదం సంభవించింది దీనితో ఇంటిలో ఉన్న బాహిద్ తో పాటు అతని భార్య రూబీ,
కొడుకు నౌషాద్, కుమార్తెలు నగ్మా,ఆష్మా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటా హుటిన అక్కడికి చేరుకొని గాయపడిన వారిని ప్రథమ చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో తల్లి రూబీ కి ,కుమార్తె నగ్మా కు
తీవ్ర గాయాలు కావడం తో మెరుగైన చికిర్చ కోసం చెన్నై కి తరలించారు. వీరి స్వస్థలం ఉత్తప్రదేశ్ లోని జాలోన్ జిల్లా పరిధి లో ఉన్న రెండర్ మండలం, బరోలి గ్రామం కి చెందిన
వారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Post a Comment