జగన్ ప్రభుత్వానికి కాలం చెల్లింది..... తెలుగుదేశం జైత్రయాత్ర మొదలైంది !
సూళ్లూరుపేట గడ్డపై వేనాటి సతీష్ రెడ్డి నాయకత్వంలో తెలుగుదేశం జెండా ఎగరేస్తాం.
రవి కిరణాలు, సూళ్లూరుపేట మార్చి 18:-
జగన్ ప్రభుత్వానికి కాలం చెల్లింది.. తెలుగుదేశం పార్టీ జైత్రయాత్ర మొదలైందని, సూళ్లూరుపేట గడ్డపై తిరుపతి పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్ రెడ్డి, నాయకత్వంలో తెలుగుదేశం జెండా ఎగరేస్తామని,
శాసనమండలి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వైపు నిలబడిన విజ్ఞులైన పట్టభద్రులందరికీ వందనం అంటూ టీడీపీ తిరుపతి పార్లమెంటరీ మహిళ అధికార ప్రతినిధి మరియు మాజీ మునిసిపల్ కౌన్సిలర్ బుద్ధి విజయలక్ష్మి,
కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్బంగా ఆమె శనివారం సూళ్లూరుపేట పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఓ ప్రకటన విడుదల చేశారు.ప్రతికూల పరిస్థితులో కూడా పట్టభద్రులు చూపిన తెగువ మరువలేనిదన్నారు. తెలుగుదేశం పార్టీ బలపరిచిన తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం అభ్యర్ధి కంచర్ల శ్రీకాంత్ ను ఓడించడానికి అధికార పార్టీ వైసీపీ అన్ని అవకాశాలు వినియోగించుకుందని,దొంగ ఓట్లు భారీగా వేయించారని పేర్కొన్నారు. టిడిపి నాయకులు, కార్యకర్తలపై దౌర్జన్యం చేశారని, దాడులు చేశారని, డబ్బు పంపిణీ చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్నారు. అయినా పట్టభద్రులు మాత్రం నిజాయితీగా తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచి తమ విజ్ఞతను చాటుకున్నారని హర్షం వ్యక్తం చేశారు. నోటుకు ఓటు అమ్ముకోమని నిరూపించారని కొనియాడారు. సామాన్య జనంతో పాటు మేధావి వర్గంలో వైసీపీ విధానాలపై ఎంత వ్యతిరేకత ఉందో ఈ శాసనమండలి ఎన్నికల ఫలితాలే నిదరన్శమన్నారు. తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సుమారు 45శాతం ఓట్లు పోలయ్యాయని, అధికార పార్టీకి అనుకూలంగా 35శాతం ఓట్లు పోలయ్యాయని గుర్తు చేశారు. అంటే అధికార పార్టీకి ప్రజల్లో ప్రస్తుతం 65శాతం ఓటర్లు వ్యతిరేకంగా ఉన్నారని తెలిపారు . ఉత్తరాంధ్రలో కూడా టీడీపీ బలపరచిన అభ్యర్థి భారీ మెజారిటీతో విజయం సాధించాడని పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల్లో కూడా వైసీపీతో టీడీపీ హోరా హోరీగా పోరాడుతోందన్నారు. అంటే జగన్ సొంత జిల్లాలో కూడా ఆయనకు ఎదురు గాలి వీస్తోందని ఈ ఫలితాలు చెబుతున్నాయని ఎద్దేవా చేశారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు మార్పు కోరుకుంటున్నారని శాసనమండలి ఫలితాలు చెబుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచి తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గంలో కంచర్ల శ్రీకాంత్ విజయానికి సహకరించిన పట్టభద్రులు, కార్యకర్తలు, నేతలు అందరికీ పేరు పేరునా వందనాలు తెలిపారు. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కూడా టీడీపీకి అండగా ప్రజలు నిలవాలని మనసారా కోరారు.
ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంటరీ మహిళ ఉపాధ్యక్షురాలు సుజాత, సులూరుపేట నియోజకవర్గం టిడిపి మహిళా ప్రధాన కార్యదర్శి, మాజీ సర్పంచ్ ప్రమీలమ్మ, సులూరుపేట నియోజకవర్గ మహిళా ఉపాధ్యక్షురాలు, జమీల, కార్యదర్శి మస్తానమ్మ,మెదుగులు పాలెం సర్పంచ్ చెల్లెమ్మ, సులూరుపేట పట్టణ మహిళా అధ్యక్షురాలు మంజుల,పట్టణ ఉప అధ్యక్షురాలు రత్తమ్మ, ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మి, కార్యదర్శి దీప, మహిళా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Post a Comment