ఈ నెల 13 న ఎం.ఎల్.సి. ఎన్నికల పోలింగ్.
పోలింగ్ కేంద్రాలలో పి.ఓ., ఎ.పి.ఓ. లు కీలకం.
పి.ఓ. హ్యాండ్ బుక్ లో ప్రతి లైన్ ను చదివి అర్థం చేసుకోవాలి.
రెండు సార్లు ఇవ్వన్నున్న శిక్షణలో సందేహాలు నివృత్తి చేసుకోవాలి: జిల్లా కలెక్టర్
తిరుపతి, మార్చి 01 (రవి కిరణాలు): -
మార్చి 13 న జరగనున్న ఎం.ఎల్.సి ఎన్నికల పోలింగ్ లో పి.ఓ.లకే కీలక బాద్యతలు ఉంటాయని పి.ఓ. హ్యాండ్ బుక్ ను చదివి అర్థం చేసుకొని శిక్షణా సమయంలో సందేహాలను నివృత్తి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి అన్నారు. బుధవారం ఉదయం స్థానిక శ్రీ పద్మావతీ మహిళా విశ్వ విద్యాలయ ద్రుతి ఆడిటోరియంలో పోలింగ్ ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు ఇచ్చిన శిక్షణా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి కె.వెంకటరమణా రెడ్డి పాల్గొని ఎన్నికల విధులలో నిర్వహించాల్సిన అంశాలపై సూచనలు చేశారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 13 న ప్రకాశం – నెల్లూరు- చిత్తూరు ఎం.ఎల్.సి. ఎన్నికలకు సంబంధించి ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాలకు పోలింగ్ జరగనున్నదని, పోలింగ్ సమయం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించాలని అన్నారు. పి.ఓ.లకు , ఎ.పి.ఓ.లకు నేటి శిక్షణతో పాటు మరో శిక్షణ ఈ నెల 9 న నిర్వహించనున్నామని అందులో ప్రధానంగా బ్యాలెట్ బాక్సులను ఎలా ఓపెన్ చేయడం, పోలింగ్ ముగింపు తర్వాత సీల్ వేయడం వంటివి పవర్ పాయింట్ ప్రజంటేషన్ అనoతరం డమ్మీ మాడల్ బ్యాలెట్ బాక్సుల వాడకం విధానం స్వయంగా ప్రతి ఒక్కరు చూసి నేర్చుకోవాలని అన్నారు. పోలింగ్ ముందు రోజు ఈ నెల 12 న జిల్లాలోని ప్రతి రెవెన్యూ డివిజన్ కేంద్రంలో పోలింగ్ సామగ్రి పంపిణీ వుంటుందని, సూచించిన సమయానికి ఆలస్యం లేకుండా చేరుకోవాల్సి వుటుందని అన్నారు. పి.ఓ.లు పోలింగ్ సామగ్రిని చెక్ లిస్టు మేరకు సరిచూసుకుని, ప్రధానంగా బ్యాలెట్ బాక్సు లు, ఓటర్ జాబితా సదరు పోలింగ్ కేంద్రానికి సరిపోయే విధంగా సరిచూసుకుని, కేటాయించిన రూట్ బస్సులలో సాయంత్రం లోపు చేరుకోవాలని అన్నారు. ప్రతి మండలంలో 2 నుండి 6 వరకు పోలింగ్ కేంద్రాలు ఉంటాయని , పోలింగ్ కేంద్రాల్లో వసతులు పరిశీలించి ఏదైనా అవసరమనిపిస్తే స్థానిక తహసిల్దార్ సహాయం తీసుకోవాలని, 100 మీటర్ల మార్కింగ్ ఏర్పాటు చూసుకోవాలని పోలింగ్ రోజు ఇతరులు ఎవ్వరు ఆ పరిధిలో లేకుండా చూడాలని అన్నారు. పోలింగ్ రోజు ఉదయం 7 గంటల కల్లా పోలింగ్ కేంద్రం లో వసతులు, ఏజంట్ల పాసులు పంపిణీ, సీటింగ్ ఏర్పాట్లు పూర్తి కావాలని 8 గంటలకు పోలింగ్ ప్రారంభం అయ్యేలా చూడాలని అన్నారు. పోలింగ్ బూత్ లో ఓటు వేసే ప్రక్రియ ఎవరికీ కనబడకుండా క్యాబిన్ ఏర్పాటు ఉండాలని, వెబ్ కెమరాలు కూడా ఆ విధంగా అమర్చాల్సి ఉంటుందని అన్నారు. అనివార్య కారణాల వల్ల పి.ఓ. హాజరు కాలేకున్నా ఎ.పి.ఓ. నే పి.ఓ. గా వ్యవహరిస్తారని సహాయకులుగా ఓ.పి.ఓ. లు ఇద్దరు ఉంటారని అన్నారు. పోలింగ్ స్లిప్పు, ఎన్నికల కమీషన్ సూచించిన ఏదేని గుర్తింపు కార్డు కలిగిన ఓటర్ కు బ్యాలెట్ అందించేటప్పుడు సరైన విధంగా బ్యాలెట్ మీరే మొదట నిలువు మడత, ఆపిదప అడ్డంగా మడతతో అందించి, ఓటరు పెన్నుతో అంకెలు వ్రాసిన అనంతరం బ్యాలెట్ ను అదే విధంగా మడత పెట్టి బ్యాలెట్ బాక్సులో వేయాలని సూచించాలని, ఎవరైనా బ్యాలెట్ ను బయటకు తీసుకుని వెళితే అక్కడే ఉన్న ఎస్.హెచ్.ఓ. కు డిక్లరేషన్ అందించి పి.ఓ. కేసు నమోదు చేయించాలని అన్నారు. పోలింగ్ ముగింపు అనంతరం ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్సులను సీల్ చేసి సంతకాలు తీసుకుని డివిజన్ కేంద్రంలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ సెంటర్ స్ట్రాంగ్ రూమ్ కు చేర్చాల్సి ఉంటుందని, పోలింగ్ ప్రక్రియ లో ఎప్పటికప్పుడు నింపిన పి.ఓ. డైరీ, ఇతర ప్రొఫార్మాలను పూరించి అందించాల్సి ఉంటుందని అన్నారు. చిన్న పొరపాటుకు కూడా తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ జరగాలని అన్నారు.
అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ మరియు జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసరావు, జి.ఎం.ఎస్.ఎస్. స్పెషల్ డిప్యూటి కలెక్టర్ కోదండరామిరెడ్డి , తిరుపతి, శ్రీకాళహస్తి ఆర్ డి ఓ లు కనకనరసా రెడ్డి, రామారావు పోలింగ్ పక్రియ ,అనుసరించాల్సిన విధానం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించి, పి.ఓ., ఎపిఒ లకు డమ్మీ బ్యాలెట్ పేపర్, డమ్మీ బ్యాలెట్ బాక్సుల వాడకం పై శిక్షణ ఇచ్చి అవగాహన కల్పించారు.
ఈ శిక్షణా కార్యక్రమంలో నగరపాలక కమిషనర్ అనుపమ అంజలి, డిప్యూటి కమిషనర్ చంద్రమౌలీశ్వర రెడ్డి, తహసిల్దార్లు మరియు ఎ ఇ ఆర్ ఓ లు వెంకటరమణ , జరీన , విధులు కేటాయించిన పి.ఓ.లు, ఎ.పి.లు , తహసిల్దార్లు, ఎం.పి.డి.ఓ.లు ఎన్నికల డిటి లు జీవన్ , రామచంద్ర , జానీ సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లాలో పోలింగ్ స్టేషన్లు, ఓటర్ల సంఖ్య ఎన్నికల కమీషన్ సూచించిన తేది 23.02.2023 రోల్ :
తిరుపతి జిల్లా పట్టభద్రుల వివరాలు :
గూడూరు డివిజన్, పోలింగ్ కేంద్రాలు 11, ఓటర్లు 18,761
సూళ్ళురుపేట డివిజన్, పోలింగ్ కేంద్రాలు 11, ఓటర్లు 15,238
శ్రీకాళహస్తి డివిజన్, పోలింగ్ కేంద్రాలు 11, ఓటర్లు 15,043
తిరుపతి డివిజన్, పోలింగ్ కేంద్రాలు 29, ఓటర్లు 37,899
మొత్తం పట్టభద్రుల ఓటర్లు: 86,941
తిరుపతి జిల్లా ఉపాధ్యాయ వివరాలు :
గూడూరు డివిజన్, పోలింగ్ కేంద్రాలు 8, ఓటర్లు 1345
సూళ్ళురుపేట డివిజన్, పోలింగ్ కేంద్రాలు 9, ఓటర్లు 893
శ్రీకాళహస్తి డివిజన్, పోలింగ్ కేంద్రాలు 8, ఓటర్లు 811
తిరుపతి డివిజన్, పోలింగ్ కేంద్రాలు 12, ఓటర్లు 3083
మొత్తం ఉపాధ్యాయ ఓటర్లు:6132
Post a Comment