10 వ తరగతి విద్యార్థులకు పరీక్ష కిట్లు అందజేసిన అత్తిరాల కిరణ్ కుమార్ గౌడ్.
రవి కిరణాలు, దొరవారిసత్రం, మార్చి 25:-
మండలంలోని మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ బీ.సీ సంక్షేమ సంఘం తిరుపతి జిల్లా యువజన అధ్యక్షులు అత్తిరాల కిరణ్ కుమార్ గౌడ్ గారు మరియు ఆం.ప్ర బీ.సీ విద్యార్థి సంక్షేమ సంఘం రాయలసీమ అధ్యక్షులు గంగోరు వాసు కుమార్ గారి అధ్వర్యంలో 10 వ తరగతి పబ్లిక్ పరీక్షలు ఆసన్నమవుతున్న నేపథ్యంలో విద్యార్థులకు పరీక్ష సామాగ్రి, రైటింగ్ ప్యాడ్, పెన్, పెన్సిల్, స్కేల్, మొదలగు సామాగ్రి అందించడం జరిగింది.
అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులంతా ప్రణాళికాబద్ధంగా పరీక్షలకు హాజరయ్యేందుకు సన్నద్ధం కావాలని కోరారు. విద్యార్థులంతా మానసిక ఒత్తిడి నుంచి దూరంగా ఉండాలని, ప్రణాళికాబద్ధంగా పాఠ్యాంశాలను చదువుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దొరవారిసత్రం ఎస్సై తిరుమల రావు హాజరయ్యారు.
ఎస్సై మాట్లాడుతూ నిరంతర ప్రక్రియగా తరగతిలో నేర్చుకున్న అంశాలపై పునశ్చరణ చేపట్టాలని కోరారు. సంబంధిత విషయానికి సంబంధించిన ఉపాధ్యాయుల మార్గదర్శనం తీసుకొని పబ్లిక్ పరీక్షల్లో అద్భుత ఫలితాలను సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థులంతా మోడల్ ప్రశ్న పత్రాలను పునఃచరణ చేసుకోవాలని కోరారు. శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుందని జాతిపిత మహాత్మాగాంధీ చెప్పిన సూక్తిని విద్యార్థులంతా ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ తిరుపతయ్య, ఉప ప్రిన్సిపల్ పరమేశ్వరరావు, బీ.సీనాయకులు జె.కిరణ్, తదితరులు పాల్గొన్నారు.
Post a Comment