రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నెల్లూరు రూరల్ ప్రజల నిరసన గొంతుక పేరిట నిరసన కార్యక్రమం నిర్వహించిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ములుముడి-తాటిపర్తి రోడ్డు మరియు కొత్త కాలువ-కోడూరుపాడు రోడ్డు ఈ రోడ్ల సమస్య పరిష్కారంకాక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. శివారు కాలనీలు వేగవంతంగా పెరుగుతున్నాయి. శివారు కాలనీలలో కరెంటు, డ్రైన్లు, రోడ్లు, సౌకర్యాల కోసం నిధులు అడుగుతూనే ఉన్నా, వింటూనే ఉన్నారు. నిధులు విడుదల అయ్యే పరిస్థితి లేదు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. పొట్టేపాళెం కలుజు నెల్లూరు రూరలోనే ఉంది. కానీ సగం నెల్లూరు జిల్లా సమస్య. ఆ పొట్టేపాలెం కలుజు మీద వంతెన లేకపోడడం వలన ప్రజలు ఆ దారిగుండా పోతూ ప్రమాదాలబారిన పడుతున్నారు. ఈ సమస్య పరిష్కారం చెయ్యాలని దాదాపు 1 1/2 సంవత్సరం క్రితం ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారికి ఆ దారిగుండా తీసుకొనిపోతే పొట్టేపాళెం కలుజుమీద వంతెన, ములుముడి కలుజు మీద వంతెన మరియు ములుముడి-తాటిపర్తి రోడ్డు ఆధునీకరణకు 28 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. కానీ ఇప్పటివరకు ఆ నిధులు విడుదల కాలేదు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. పొట్టేపాళెం మరియు ములుముడి కలుజు మీద నేను వెళ్తున్నప్పుడు ప్రజలు చూసే చూపులకు నేను సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. 40 ఏళ్లుగా పరిస్కారం కాని కొమ్మరపూడి లిఫ్ట్ ఇరిగేషన్ సమస్య పరిష్కారం అవుతుందని సంతోషించా. కానీ ఇప్పటివరకు ఈ సమస్యకు అతీగతీ లేదు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
కొమ్మరపూడి రైతుల సమస్య మరీ బాధాకరం. జగనన్న కాలనీలకు వాళ్లకు స్థలాలు ఇచ్చాము. సగం మందికి నష్టపరిహారం ఇచ్చారు. సగం మందికి నష్టపరిహారం ఇవ్వలేదు. ఈ సమస్య పరిస్కారం కోసం ముఖ్యమంత్రి దగ్గరనుంచి మంత్రుల వరకు 50, 60 సార్లు వెళ్ళా. కానీ ఇప్పటికి ఈ సమస్య పరిష్కారంకాని పరిస్థితి. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. బి.సి. భవన్, అంబేద్కర్ భవన్ కం స్టడీ సర్కిల్ పిల్లర్లు స్థాయిలో ఉంది. ఇవి రెండు పూర్తయితే నెల్లూరు రూరల్ కే కాదు జిల్లాకే తలమానికం. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. కాపు భవన్ ఇప్పటికే చాలావరకు పూర్తయింది. అతితక్కువ మొత్తంలో ఖర్చు పెడితే ఈ కాపు భవన్ కూడా పూర్తవుతుంది. కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఈ సమస్యలన్నిటినీ పరిష్కరిస్తే ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారికి పూలమాలవేసి అభినందిస్తాను. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
Post a Comment