మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో జయభేరి ఖాయం
.. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి
ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నెల్లూరు జిల్లా పరిధిలో ఉన్న మూడు స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల అభ్యర్థిగా మేరీగా మురళిని ప్రకటించామని ఆ స్థానానికి సంబంధించి 98 శాతం ప్రజాప్రతినిధుల బలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందని ప్రతిపక్షాల నుంచి పోటీ ఉండబోదని ఆశిస్తున్నామన్నారు. ఏకగ్రీవంగా ఈ స్థానాన్ని కైవసం చేసుకోబోతున్నట్లు తెలిపారు
మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, రీజనల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి తో కలిసి నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశంలో నిర్వహించిన మీడియా సమావేశం హైలైట్స్
శాసనమండలి ఎన్నికల్లో
ఎస్.సి, ఎస్ టి...బి.సి లకు ముఖ్యమంత్రి జగన్ అధిక ప్రాధాన్యం ఇచ్చారు
అన్ని స్థానాల్లో విజయం సాధిస్తాం
పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీ కి సంబంధించి గెలుపు ఉండేందుకు ఎమ్.ఎల్.ఏ.లు..ఇతర నేతలు కలిసికట్టుగా పనిచేసేలా ప్రణాళిక రూపొందించాం
రేపు ఎం.ఎల్.సి.అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తారు
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు..చక్కటి పరిపాలన ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయానికి దోహదపడతాయి
Post a Comment