మెడికల్ మాఫియాఆగడాలనునియంత్రించాలి
మున్నా జిల్లా ఏఐవైఎఫ్ జిల్లా కన్వీనర్
నెల్లూరు:ప్రజల రక్తాన్ని జలగల్లా తాగుతున్న మెడికల్ షాపు యాజమాన్యాలుమామూళ్ల మత్తులో చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న ప్రభుత్వ అధికారులు? అని ఏఐవైఎఫ్ జిల్లా కన్వీనర్ మున్నా అన్నారు. బుధవారం నెల్లూరులోని రామకోటయ్య భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూరాష్ట్రంలో రోజురోజుకుమెడికల్ మాఫియా (ప్రయివేట్ మెడికల్ షాపుల) ఆగడాలు పెరిగిపోతున్నాయని, ప్రజల రక్తాన్ని మెడికల్ షాపు యజమాన్యాలు జలగలుగా తాగుతున్నా మెడికల్ మాఫియా ఆగడాలను అరికట్టాల్సిన రాష్ట్ర ఔషధ నియంత్రణ మండలి (డ్రగ్ కంట్రోల్ బోర్డు) అధికారులు మామూళ్ల మత్తులో పట్టి పట్టనట్లు వ్యవహరిస్తూ అమాయక ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకోవడం సరికాదని అన్నారు .
.రాష్ట్రములో అనేక ప్రయివేటు హాస్పిటల్ యాజమాన్యాలు, ప్రభుత్వ డాక్టర్స్, మెడికల్ షాపుల యాజమాన్యాలు కలసి సిండికేట్ గా ఏర్పడి పెద్ద ఎత్తున నకిలీ మందులను,కాలం చెల్లిన మందులను విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యంతో వ్యాపారం చేస్తున్నారు అని అన్నారు. అనేక ప్రయువెట్ క్లినిక్ డాక్టర్స్ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కొన్ని మందుల షాపుల్లో మాత్రమే కొనాలని వత్తిడి చేస్తున్నారని నిబంధనల ప్రకారం రోగి ఆరోగ్య పరిస్తితి నీ బట్టి డాక్టరు రాసే ప్రిస్కిషన్ లో జనరిక్ మందుల పేర్లతో అనగా మాలిక్యుల్ పేర్లను రాయాల్సి ఉండగా కేవలం ఎక్కువ కమిషన్ ఇచ్చే కొన్ని బ్రాండెడ్ మందులను డోస్ లకు మించి ఇస్తున్నారని పలు మెడికల్ షాపుల యాజమాన్యాలు బిల్లులు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
పేద ప్రజల అమాయకత్వాన్ని అవకాశం గా తీసుకొని కంపెనీ వేరు మెడిసిన్ ఒకటి అంటూ నాసిరకం మందులను అమ్మడంతో పాటు
పలురకౌంట్లో డిస్కౌంట్ ల పేరుతో పేద ప్రజలకు ఏరా వేస్తున్నాయని అన్నారు.
అనేక రకాల టెస్టులు పేరుతో ల్యాబ్ యాజమాన్యాలు పేదల రక్తాన్ని తాగుతుంటే అరికట్టవలసిన ఔషధ నియంత్రణ మండలి, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మామూళ్ల మత్తులో తులుతూ పట్టీ పట్టనట్టు వ్యవహరిస్తూ ప్రజా ఆరోగ్యాన్ని గాలికి వదిలేసారని ఆవేదన వ్యక్తంచేశారు.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు మేల్కొని వైద్య ఆరోగ్యశాఖలో జరుగుతున్నటువంటి అవకతవకలు, మెడికల్ మాఫియా చేస్తున్నటువంటి ఆగడాల నరికట్టాలని తద్వారా రాష్ట్రంలో ప్రజా ఆరోగ్యానికి కాపాడాలని కోరారు.ఈ కార్యక్రమంలో
ఏఐవైఎఫ్ నెల్లూరు నగర నాయకులు గౌస్ ,సర్దార్, షేక్ మునీర్,
ఫయాజ్. తదితరులు పాల్గొన్నారు
Post a Comment