తిరువనంతపురం సదస్సులో మంత్రి కాకాణి

 




 తిరువనంతపురం సదస్సులో మంత్రి కాకాణి

కేరళ రాజధాని తిరువనంతపురంలో జరిగిన వైగా -2023 (VAIGA2023 -Value Addition For Income Generation in Agriculture - వ్యవసాయంలో ఆదాయ ఉత్పత్తికి విలువ జోడింపు)  పై నిర్వహించిన సెమినార్ లో పాల్గొని, ప్రసంగించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మాత్యులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పి.ప్రసాద్ తో పలు అంశాలపై చర్చించారు. అనంతరం‌ కాకాణి మాట్లాడుతూ. రైతుల సేవలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిశానిర్దేశంతో రైతు భరోసా కేంద్రాల వ్యవస్థ రూపొందించామని చెప్పారు.ఈ కార్యక్రమంలో హిమాచల్ ప్రదేశ్  రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి చందర్ కుమార్, ఆంధ్ర రాష్ట్రానికి చెందిన పలువురు ఉన్నతాధికారులు, కేరళ వ్యవసాయ శాఖ అధికారులు, దేశవ్యాప్తంగా విచ్చేసిన శాస్త్రవేత్తలు, దేశం నలుమూలల నుండి విచ్చేసిన వ్యవసాయ నిపుణులు, ఆదర్శ రైతులు, వ్యవసాయ రంగంపై ఆధారపడి నిర్వహిస్తున్న పలు పరిశ్రమల యాజమాన్యాల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget