ప్రతి రైతు పంట భీమ నమోదు చేయించుకోవాలి ఏ డి ఏ సిహెచ్ నాగరాజు
రవి కిరణాలు,తిరుపతి జిల్లా, సూళ్లూరుపేట:-
పట్టణంలోని వ్యవసాయ శాఖ కార్యాలయం నందు సూళ్లూరుపేట మండల వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్ మంద దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశంలో మండల వ్యవసాయ శాఖ అధికారి సిహెచ్ నాగరాజు పాల్గొన్నారు. అనంతరం ఆయన రైతులతో మాట్లాడుతూ ప్రతి రైతు పంట నమోదు కార్యక్రమంలో భాగంగా వారి వేసిన పంటను నమోదు చేసుకుని దాని ద్వారా అమలు చేస్తున్న వైఎస్సార్ ఉచిత పంట బీమా పథకము మరియు సున్నా వడ్డీ పంట రుణాలు, ధాన్యం కొనుగోలు పథకం లో లబ్ధి పొందాలని తెలిపారు. అనంతరం చైర్మన్ మంద దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు అందుబాటులో వ్యక్తిగత వ్యవసాయ పనిముట్లు మరియు తెలుగు గంగా కాలువ పనులు మరమ్మత్తులు చేయించాలని కోరారు. ప్రస్తుతం ప్రభుత్వం ధాన్యం మద్దతు ధర వంద రూపాయలు పెంచి గ్రేడ్ ఏ రకముకు క్వింటాకు 2060/- రూపాయలు ఇస్తూ రైతుల లో ఆత్మస్థైర్యం ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. 2023 సంవత్సరమును చిరుధాన్యాల సంవత్సరముగా ప్రకటించారని , కాబట్టి రైతులు కూడా చిరుధాన్యాలు సాగు మీద దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఎన్ కవిత మరియు సలహా మండల సభ్యులు మెల్లకంటి వీరాస్వామి, నాగయ్య, సోమ సుందరం, రమణయ్య, జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.
Post a Comment