కోటి ఖర్చుకు రూ.కోటితో ప్రచారమా
ఎన్నికల కోడ్ అమలు విషయంలో జగన్ రెడ్డికి ప్రత్యేక చట్టాలు ఉన్నాయా
ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావంతులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి
ముత్తుకూరులో మీడియాతో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
సీఎం జగన్ రెడ్డికి పబ్లిసిటీ పిచ్చి పెరిగిపోయింది
చారాణా కోడికి బారాణా మసాలా వేసినట్లు ప్రజల సొత్తును విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తున్నారు
వైఎస్సార్ లా నేస్తం పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 2011 మంది న్యాయవాదులకు రూ.కోటి అకౌంట్లలో వేశారు
బటన్ నొక్కింది కోటి రూపాయలకు అయితే పత్రికల్లో ప్రకటనల కోసం రూ. కోటి ఖర్చుబెట్టాడు
ప్రజలు కట్టిన పన్నులతో పాటు కేంద్ర ప్రభుత్వం నిధులతో ఏ కార్యక్రమం చేపట్టినా జగనన్న పేర్లతో నింపేశారు
చివరకు ప్రజల సొంత ఆస్తులపైన కూడా జగనన్న, వైఎస్సార్ ముద్రలు వేస్తున్నారు..రాష్ట్ర ప్రజలకు ఇదేం ఖర్మ
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ పేరుతో ఓ వైపు మహానుభావుల విగ్రహాలకు ముసుగులు వేశారు..ఇక్కడేమే పత్రికలకు సీఎం ఫొటో పెట్టుకుని కోట్లు ఖర్చుపెట్టి ప్రకటనలు ఇస్తున్నారు
ఇది ఎన్నికల నియామవళి ఉల్లంఘన కాదా...జగన్ రెడ్డికి ప్రత్యేక చట్టాలు ఉన్నాయా
ఎన్నికల సంఘం అధికారులు వెంటనే స్పందించి ఈ ప్రకటనలు, బటన్ నొక్కుడుపై చర్యలు తీసుకోవాలి
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు ఆలోచించి ఓటు వేయడం ద్వారా రాష్ట్రానికి ఓ సందేశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నా
విద్యావంతులు రాష్ట్ర భవిష్యత్తుతో పాటు ఐదు కోట్ల ఆంధ్రుల భవిత గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి
ఎమ్మెల్సీలుగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించడం ద్వారా అరాచక వైసీపీ ప్రభుత్వానికి ఒక గుణపాఠం చెప్పాలని కోరుతున్నా
Post a Comment