చెంగాళమ్మ మహా కుంభాభిషేకం సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించిన శ్రీకాళహస్తీశ్వర ఆలయ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు
తిరుపతి జిల్లా, సూళ్లూరుపేట ఫిబ్రవరి 24 (రవి కిరణాలు):-
సూళ్లూరుపేట పట్టణంలో వెలసి ఉన్న భక్తుల కొంగు బంగారం కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి దక్షిణ ముఖ ఖాళీ శ్రీ శ్రీ శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి తల్లికి శుక్రవారం మహా కుంభాభిషేకం ఆఖరి రోజు సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర పాలక మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు దంపతులు కలిసి చెంగాళమ్మ తల్లికి సొంత నిధులతో పట్టు వస్త్రాలు మరియు సారె సమర్పించారు. వీరికి సూళ్లూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య చెంగాళమ్మ దేవస్థానం పాలక మండలి ఛైర్మన్ బాలచంద్రారెడ్డి మరియు దేవస్థానం ఈఓ శ్రీనివాసుల రెడ్డి పూర్ణకుంభంతో స్వాగతం పలికి శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు దంపతులు పట్టు వస్త్రాలు శిరస్సుపై ఉంచుకొని ఊరేగింపుగా తీసుకువెళ్లి ఆలయంలోని చెంగాళమ్మ పరమేశ్వరి తల్లికి సాంప్రదాయ పద్ధతిలో పట్టు వస్త్రాలు సమర్పించారు.. శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానం అర్చకులు వెద పండితులు విశేష పూజలు జరిపి పట్టు వస్త్రాలను శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవార్లకు అలంకరించి విశేష పూజలు జరిపారు. అనంతరం శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవార్లకు మహా కుంభాభిషేకం పురస్కరించుకొని పట్టు వస్త్రాలు సమర్పించే భాగ్యం లభించడం తమ పూర్వజన్మ సుకృతం అని శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ అంజూ రు శ్రీనివాసులు అన్నారు. ఎంతో విశిష్ట క్షేత్రమైన శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవార్ల పాల్గొనడం అదృష్టం అన్నారు. అమ్మ వార్లు కృప కటాక్షాలు ప్రజలందరికీ లభించాలని అందరూ సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట మున్సిపల్ చైర్మన్ శ్రీమంత్ రెడ్డి. తడ ఎంపీపీ కొలివి రఘురెడ్డి శ్రీకాళహస్తి పాలక మండలి సభ్యులు కొండూరు సునీత, రమాప్రభ,ప్రత్యేక ఆహ్వానిత బోర్డు సభ్యులు శ్రీదేవి, మరియు సూళ్లూరుపేట చెంగాళమ్మ పాలకమండలి సభ్యులు, చెంగాళమ్మ దేవస్థాన అధికారులు పట్టణ ప్రముఖులు కొండూరు నంద, భాస్కర్ ముదిరాజ్, పీఎం చంద్ర, దినేష్ శ్రీకాళహస్తి దేవస్థానం అధికారులు చైర్మన్ సిసి సుదర్శన్ రెడ్డి, కామేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
Post a Comment