శ్రీసిటీని సందర్శించిన ఎస్టోనియన్ వ్యాపార ప్రతినిధుల బృందం

 







 శ్రీసిటీని సందర్శించిన ఎస్టోనియన్ వ్యాపార ప్రతినిధుల బృందం
- భారత్ లో మొబైల్ హెల్త్‌కేర్ యూనిట్ల తయారీ పరిశ్రమపై అధ్యయనం

రవి కిరణాలు న్యూస్ తడ శ్రీసిటీ, ఫిబ్రవరి 23, 2023:

సెమెట్రాన్/ఎంఎంహెచ్ గ్రూప్ ఎక్స్‌పోర్ట్స్ విభాగాధిపతి, ఎస్టోనియా మాజీ రక్షణ మంత్రి మార్గస్ త్సాక్నా నేతృత్వంలోని ఎస్టోనియన్ వ్యాపార ప్రతినిధుల బృందం, భారతీయ జాయింట్ వెంచర్ పార్ట్‌నర్స్ 'ఏపిరాన్ హెల్త్' సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లతో కలిసి గురువారం శ్రీసిటీని సందర్శించింది. శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి వారికి సాదర స్వాగతం పలికి, శ్రీసిటీ భారీ పారిశ్రామిక నగరం మౌళిక సదుపాయాలు, ప్రత్యేకతలు, పరిశ్రమల ఏర్పాటు ప్రయోజనాలను వివరించారు.  

ఎస్టోనియాకు చెందిన సెమెట్రాన్ లిమిటెడ్ ఉన్నతాధికారులు మరియు ఏపిరాన్ హెల్త్‌కేర్ ప్రతినిధుల శ్రీసిటీ సందర్శన పట్ల రవీంద్ర సన్నారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ, ఇక్కడ వ్యాపార అనుకూల వాతావరణం, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, ప్రతిభ కలిగిన మానవ వనరులు, ప్రభుత్వ సహకారం ఖచ్చితంగా వారిని ఆకట్టుకుంటుందన్నారు. అలాగే ఎస్టోనియా మరియు ఉత్తర ఐరోపాలోని ఇతర దేశాల నుండి పెట్టుబడులకు మార్గం సుగమం చేస్తుందని పేర్కొన్నారు.

ఇండస్ట్రియల్ పార్క్ గురించి ప్రత్యక్షంగా తెలుసుకోవడం, దాని వ్యాపార సామర్థ్యాన్ని అంచనా వేయడం మరియు ప్లాంట్ ఏర్పాటు చేసే అవకాశాలను అన్వేషించడం వారి సందర్శన ఉద్దేశం.  దేశీయ మరియు ఎగుమతి ప్రయోజనాల కోసం, ముఖ్యంగా ఆసియా, యూరోపియన్ యూనియన్ మరియు ఆఫ్రికా కోసం 'మేక్ ఇన్ ఇండియా' కింద మొబైల్ హెల్త్‌కేర్ యూనిట్లను భారతదేశంలో తయారు చేయాలని కంపెనీ ప్రతిపాదిస్తోంది. తదనుగుణంగా అనువైన పారిశ్రామిక  ప్రదేశం కొరకు అన్వేషిస్తున్నది.

వ్యాపార ప్రతినిధులు శ్రీసిటీ ఎండీతో చర్చల సందర్భంగా ఎంతో ఆసక్తిని కనబరిచి, శ్రీసిటీలోని వివిధ అంశాలపై ప్రశ్నలడిగి తమ సందేహాలు నివృత్తి చేసుకున్నారు. అనంతరం వీరు పారిశ్రామికవాడను సందర్శించారు.
కాగా, సెమెట్రాన్/ఎంఎంహెచ్ సంస్థ ఎస్టోనియాలోని ప్రముఖ ఇన్వెస్టర్ గ్రూప్. ఆ దేశం యొక్క డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ ఇండస్ట్రీ ఇన్నోవేషన్ క్లస్టర్‌లో సభ్యులు. ఎంటర్‌ప్రైజ్ ఎస్టోనియా ద్వారా యూరోపియన్ రీజినల్ డెవలప్‌మెంట్ ఫండ్ ద్వారా ఈ క్లస్టర్ కు నిధులు అందుతోంది. ఇది NATOలోని సభ్య దేశాలకు వేగవంతమైన విస్తరణ మొబైల్ మాడ్యులర్ ఫీల్డ్ హాస్పిటల్ యూనిట్లు, ఇతర అనుబంధ ఉత్పత్తులను తయారీ సరఫరా చేస్తుంది. ఏపిరాన్ హెల్త్‌కేర్ అనేది హెల్త్-టెక్ విభాగంలో ప్రారంభించబడ్డ ఒక అంకుర  సంస్థ.  జనాభాలోని అన్ని వర్గాలకు సరసమైన, అందుబాటులో ఉండే మొబైల్ మెడికేర్ మరియు టెలిమెడిసిన్ పరిష్కారాలను అందిస్తుంది. ఇది భారతీయ, గ్లోబల్ మార్కెట్లకు అనుగుణంగా కొత్త-యుగం వైద్య వినూత్న సాంకేతికతలను అందించాలని పనిచేస్తోంది.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget