శ్రీసిటీని సందర్శించిన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కె. సునీత




 

శ్రీసిటీని సందర్శించిన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కె. సునీత.

 రవి కిరణాలు, తిరుపతి జిల్లా, తడ శ్రీసిటి:-

రాష్ట్ర ప్రభుత్వ చేనేత మరియు జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత శ్రీసిటీని సందర్శించారు. శ్రీసిటీ ప్రెసిడెంట్ సతీష్ కామత్ (ఆపరేషన్స్) ఆమెకు సాదర స్వాగతం పలికి, పారిశ్రామిక ప్రగతి, ఉపాధి అవకాశాలు, పెట్టుబడుల అనుకూల వాతావరణంతో పాటు ఇక్కడ ఏర్పాటైన వస్త్ర పరిశ్రమలు గురించి వివరించారు.

శ్రీసిటీ మౌళిక సదుపాయాలు, పారిశ్రామిక అభివృద్ధి పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన సునీత, ముఖ్యంగా సురక్షితమైన వాతావరణంలో మహిళలకు పెద్దఎత్తున ఉపాధి కల్పిస్తున్న తీరును ప్రశంసించారు. పర్యటనలో భాగంగా శ్రీసిటీ పరిసరాలతో పాటు జెన్ లెనిన్, ఎం ఎస్ ఆర్ గార్మెంట్స్ పరిశ్రమలను ఆమె సందర్శించారు. ఆయా పరిశ్రమలలో తయారవుతున్న వస్త్ర ఉత్పత్తులతో పాటు కార్మికుల యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

ముఖ్య కార్యదర్శి పర్యటనపై స్పందించిన శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, ఆమె పరిశీలనలు, సూచనలు తమకెంతో విలువైనది అన్నారు. తరచూ ప్రభుత్వ ఉన్నతాధికారులు శ్రీసిటీని సందర్శించి పారిశ్రామిక అభివృద్ధికి సహకరించడం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి కృతఙ్ఞతలు తెలిపారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget